బాలల హక్కులను కాపాడడం బాధ్యతగా తీసుకోవాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:39 PM
బాల కార్మిక వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలించి, బాలల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరు బా ధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : బాల కార్మిక వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలించి, బాలల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరు బా ధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో ఆపరేషన్ స్మైల్ అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడి మానివేసి, బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించాలని, ఇటుక బట్టీల్లోపనిచేసే వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, అవసర మైన పుస్తకాలను అందించాల న్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ ఆలీ, బాలల సంక్షేమ కమీషన్ చైర్మన్ మహమ్మద్ వహీద్, జిల్లా సంక్షే మాధికారి రౌఫ్‌ఖాన్, షెడ్యూల్డు కులముల అభివృద్ధి అధికారి దుర్గా ప్రసాద్, అధికారులు భాగ్యవతి, రాజేశ్వరి, యాదయ్య, అనిత, ఆనంద్, పోలీసులు, కార్మిక, విద్య, వైద్య అధికారులు పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంభనతోనే అభివృద్ధి
మహిళల ఆర్థిక అభివృధ్ధే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శ్రీనిధి సిబ్బంది, సామాజిక సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రభు త్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా అన్ని రంగాల్లో రాణించేందుకు తోడ్పాటునందిస్తుందన్నారు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీనిధి రుణాల లక్ష్యం రూ. 42కోట్లకు గాను 46 శాతంతో రూ. 9.47 కోట్ల మంజూరు చేశామన్నారు. రికవరీలో భాగంగా 49 శాతం రికవరీ చేశామని, రాష్ట్ర స్థాయిలో రికవరీ పరంగా 25 స్ధానంలో జిల్లా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, అదనపు డీఆర్‌డీవో అంజయ్య, శ్రీనిధి రిజనల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
101జైపూర్09 జైపూర్‌లో దుకాణంలో తనిఖీలు చేస్తున్న ఏసీపీ వెంకటేశ్వర్
చైనామాంజా అమ్మితే కఠిన చర్యలు
-జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్
జైపూర్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : కిరాణం షాపుల్లో, పతంగుల దుకాణాల్లో చైనా మాంజా అమ్మినా, ఉపయోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని షాపులను తనిఖీ చేశారు. ఏసీపీ మాట్లాడుతూ ప్ర జల ప్రాణ భద్రత దృష్య్టా ప్రభుత్వం చైనామాంజా దారాల విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ కొందరు నిబంధనలు అతిక్రమిస్తున్నారనే సమాచారం మేరకు ప్రత్యేకంగా తనిఖీ లు నిర్వహిస్తున్నామన్నారు. చైనామాంజా దారాల వల్ల ద్వి చక్రవాహనదారులు, పాదచారులు తీవ్రంగా గాయపడడంతో పాటు ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ శ్రీధర్, పోలీసులు పాల్గొన్నారు.
భీమారం : సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా చైనామాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని భీమారం ఎస్‌ఐ శ్వేత పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పతంగులు, ఫ్యాన్సీ, జనరల్ స్టోర్ దుకాణా లను తనిఖీ చేశారు.
కాసిపేట : సంక్రాంతి పండగ నేపధ్యంలో చైనామాంజా అమ్మినా, పతంగులను ఎగురవే సేందుకు చైనామాంజా వాడితే కఠిన చర్యలుంటాయని కాసిపేట ,దేవాపూర్ ఎస్‌ఐలు ఆంజనేయులు, గంగారాంలు హెచ్చరిం చారు. శుక్రవారం కాసిపేట, పెద్దనపల్లి, సోమగూ డెంలోని కిరాణం దుకాణాల్లోతనిఖీలు నిర్వహించారు.
మందమర్రిటౌన్ : సంక్రాంతి పండగ సందర్భం గా చైనామాంజా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని మందమర్రి ఎస్‌ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్ సెంటర్‌లోని పతంగుల దుకాణాలను పరిశీలిం చారు. మాంజాదారాలను పరిశీలించారు. .
రామకృష్ణపూర్‌లోని పతంగుల దుకాణాలను శుక్రవారం సీఐ శశిధర్‌రెడ్డి తనిఖీలు చేపట్టారు. సీఐ వెంట ఎస్‌ఐ భూమేష్ ఉన్నారు.
లక్షెట్టిపేట: గాలిపఠాలు ఎగురవేసేందుకు ఎవరైనా చైనా మాంజా వాడితే క్రిమినల్ కేసులు తప్పవని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సరేష్ హెచ్చరిం చారు. శుక్రవారం పట్టణంలోని పలు గాలిపఠాల విక్రయ దుకాణాలను ఆయన సిబ్బంది తో కలిసి పరిశీలించారు. ఎస్సై వెంట ఏఎస్సై గోపతి సురేష్, హెచ్‌సీ శ్రీనివాస్, లింగారెడ్డితో పాటు పీసీలు ఉన్నారు.