Share News

kumaram bheem asifabad- ఆస్తి పన్ను వసూళ్లు అంతంతే..

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:36 PM

జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపా లిటీల్లో శతశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నా రు. ఇళ్లతో పాటు దుకాణాలు తిరుగుతున్నారు. వసూళ్లకు మరో నాలుగు రోజులే మిగిలిఉండడంతో నిర్ధేశించిన లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఇప్ప టి వరకు 56 శాతం చేరుకోగా, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 46 శాతానికి వచ్చింది

kumaram bheem asifabad- ఆస్తి పన్ను వసూళ్లు అంతంతే..
లోగో

- రెండు మున్సిపాలిటీల్లో బకాయిలు రూ. 7.25 కోట్లు

- ఇప్పటివరకు రూ. 3.71 కోట్లు మాత్రమే వసూలు

- శత శాతం సాధించేందుకు సిబ్బంది పాట్లు

కాగజ్‌నగర్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపా లిటీల్లో శతశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నా రు. ఇళ్లతో పాటు దుకాణాలు తిరుగుతున్నారు. వసూళ్లకు మరో నాలుగు రోజులే మిగిలిఉండడంతో నిర్ధేశించిన లక్ష్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఇప్ప టి వరకు 56 శాతం చేరుకోగా, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 46 శాతానికి వచ్చింది. మ రో నాలుగు రోజులు గడిస్తే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించారు.

- క్లస్టర్లుగా విభజించి..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లోని 30 వార్డుల్లో క్లస్టర్లుగా విభజించారు. మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి ఆధ్వర్యంలో వార్డు అధికారులు, సిబ్బంది, జప్తు వాహనాలతో ఉదయం నుంచి వార్డుల్లో ఇంటింటా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆస్తి పన్ను చెల్లించాలని సూచిస్తున్నారు. అలాగే మైకుల ద్వారా అన్ని వార్డుల్లో కూడా ప్రచారాన్ని చేపడుతున్నారు. కచ్చితంగా ఆస్తిపన్ను వసూలు విషయంలో సిబ్బంది సీరియస్‌గా తీసుకుంటున్నారు. నిర్ధేశించిన లక్ష్యం రూ.3.81 కోట్లు లక్ష్యంగా ఉండగా, ఇందులో 56 శాతం చేశారు. అంటే 2.13 కోట్లు వసూలు చేశారు. స్వయంగా కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అన్ని వార్డుల్లో తిరుగుతు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. పన్ను చెల్లింపులకు ఆన్‌లైన్‌ మిషన్‌, యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి వద్దకే బిల్లు వసూలు చేసేందుకు వస్తుండడంతో చెల్లింపులు దారులకు కష్టాలు దూరమవుతున్నాయి. కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో గతంలో చేపట్టిన భువన్‌ సర్వేలో కొన్ని తప్పులు దొర్లడం, ఆస్తి పన్ను చెల్లించాల్సిన ఇళ్లు కూలి పోయి కొన్ని ఉండడం, మరి కొంత మంది యాజమానులు స్థానికంగా ఉండక పోవడంతో బిల్లులు ఆశించిన మేర రావడం లేదు.

- సాంకేతిక సమస్యలతో

లక్ష్య సాధన దిశగా సిబ్బంది, అధికారులు అడుగులు వేస్తున్నా సాంకేతిక సమస్యలతో శత శాతం చేరుకోవడం ఇబ్బందికరమైన సమస్య ఉంది. దీర్ఘకాలింగా పెండింగ్‌ బకాయిల వారికి మాత్రం రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసు జారీ చేసిందంటే ఆస్తి పన్నులో 50 శాతం కట్టాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇంటిలోని సామగ్రి, ఆస్తులను జప్తు చేసేందుకు వీలుంటుంది. ఇప్పటి వరకు పది వరకు రెడ్‌ నోటీసులను జారీ చేశారు. ఉదయం వేళల్లో వార్డుల్లో జప్తు చేసేందుకు ప్రత్యేక వాహనంతో సిబ్బంది వస్తుండడం గహనార్హం. ఇక ఆసిఫాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ మారడంతో గతంలో ఉండే ఆస్తి పన్ను బిల్లులే ఈ సారి వస్తున్నాయి. కొత్త మున్సిపాల్టీ కావడం, అఽధికారులు పూర్తి స్థాయిలో నియామకం కాక పోవడంతో వెరసి టార్గెట్‌ పూర్తి స్థాయిలో చేరుకోలేని పరిస్థితి ఉంది. ఆసిఫాబాద్‌ మున్సిపాల్టీలో 46 శాతం వసూలైంది. ఇక్కడి లక్ష్యం రూ.3.44 కోట్లు ఉండగా, ఇందులో రూ.1.58 కోట్ల మేర వసూలు చేశారు. ఈ మున్సిపాలిటీలో కూడా శత శాతం చేరుకోవటం కష్టంగానే మారింది. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలో ్లనూ శత శాతం చేరుకోవడం అసాధ్యంగా మారింది.

లక్ష్యం చేరుకునేందుకు కృషి..

- తిరుపతి, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

ఈ ఆర్థిక సంవత్సరం మరో నాలుగు రోజులతో ముగియనుండడంతో మాకు ఇచ్చిన లక్ష్యం పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. దీర్ఘకాలిక పెండింగ్‌ బిల్లులు వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రజలు పన్నులు చెల్లించి పట్టణాభివృ ద్ధికి సహకరించాలి.

Updated Date - Mar 27 , 2026 | 10:36 PM