Share News

ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:00 PM

ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లిం చాలని మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌ కోరారు.

ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలి
మాట్లాడుతున్న మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌

- మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌

కల్వకుర్తి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లిం చాలని మునిసిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌ కోరారు. బు ధవారం మునిసిపల్‌ కార్యాల యంలో ఆస్తి పన్ను బకా ుు లు మార్చి 31లోపు పూర్తిగా వసూలు చేయాలని మునిసి పల్‌ వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లతో సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సంద ర్భంగా మునిసిపల్‌ కమీషనర్‌ మహమ్మద్‌ షేక్‌ మాట్లాడుతూ ఆస్తి పన్నులు పూర్తిగా వసూలు అయితేనే 15వ ఫైనాన్స్‌ నిధులు మంజూరవు తాయని తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారికి రెడ్‌ నోటీస్‌ ఇస్తారని, అయినా పన్నులు చెల్లించని వారిపై తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయ న హెచ్చరించారు. బకాయిలు ఉన్న వారు పన్నులు వెంటనే చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఏఈ షబ్బీర్‌ అహ్మద్‌, మేనేజర్‌ వీఎల్‌పీ రాజకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:00 PM