kumaram bheem asifabad- చోరీ కేసులో సొత్తు రికవరీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:57 PM
కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులో కాగజ్‌నగర్ పోలీసులు సొత్తును రికవరి చేసి నలుగు రిని అరెస్టు చేసినట్టు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. గురువారం కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాగజ్‌నగర్ పట్టణంలో జనవరి నెలలో పలు చోరీలు జరిగాయని అన్నారు. తాజాగా సర్‌సిల్క్ చిన్నమార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్న
కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులో కాగజ్‌నగర్ పోలీసులు సొత్తును రికవరి చేసి నలుగు రిని అరెస్టు చేసినట్టు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. గురువారం కాగజ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాగజ్‌నగర్ పట్టణంలో జనవరి నెలలో పలు చోరీలు జరిగాయని అన్నారు. తాజాగా సర్‌సిల్క్ చిన్నమార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్న ఎఎన్‌ఎం మంగ ఇంట్లో కూడా జరిగినట్టు వివరించారు. పక్కా ఆధారంగా కాగజ్‌నగర్ పోలీసులు అన్నీ వివరాలు సేకరించి నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారని అన్నారు. వారు చోరి చేసినట్టు ఒప్పుకున్నారని చెప్పారు. చోరీకి పాల్పడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కాలనీకి చెందిన ఇర్షాద్ పాషా, సర్‌సిల్క్ కాలనీకి చెందిన షేక్ అంజద్, చింతగూడ గ్రామానికి చెందిన మీర్జా సోహెల్ బేగ్‌లు మూకుమ్మడిగా దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు. వీరంతా కూడా జల్సాలకు అలవాటు పడి అనతి కాలంలో డబ్బులు సంపాదించాలని చోరీలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. 18 తులాల బంగారం చోరీకి గురికాగా, నిందితుల నుంచి 11 తులాల బంగరాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అలాగే అరకిలో వెండి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ సొమ్మును కొనుగోలు చేసిన బాలాజీనగర్‌కు చెందిన చిలుకూరి శ్రీకాంత్‌ను కూడా అరెస్టు చేసినట్టు వివరించారు. కేసు ఛేదించిన పట్టణ సీఐ ప్రేంకుమార్, ఎస్సై సుధాకర్, నాగరాజు, రాజు, పురుషోత్తం, రషీద్, సత్యనారాయణలను ఎస్పీ అభినందించారు. ప్రతి ఒక్కరు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలను తప్పకుండా అమర్చుకోవాలని ఆమె కోరారు. దీని వల్ల చోరీలను నియంత్రించవచ్చని తెలిపారు.