Share News

బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:09 PM

బాల్య వివాహాలను ప్రోత్సహిం చ డం చట్టరిత్య నేరమని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కస మల అన్నారు.

బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం
విద్యార్థినులకు యూనీఫాం అందజేస్తున్న జడ్జి సాయికిరణ్‌

లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌

లక్షెట్టిపేట, జనవరి, 23(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను ప్రోత్సహిం చ డం చట్టరిత్య నేరమని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కస మల అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలిక ల గురుకులంలో ఏర్పాటు చేసిన న్యాయ విఙ్ఞాన సదస్సులో జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొని పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎవరైనా 18 ఏళ్లు లోపు పిల్లలకు వివాహాలు చేస్తే పేరెం ట్స్‌తో పాటు పెళ్లి చేసుకున్న వారు కూడా నేరస్తులవుతారని వాళ్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థినులు శ్ర ద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆ తరువాతే పెళ్లి చేసుకోవా లన్నారు. అనంతరం విద్యార్థినులకు జడ్జి చేతులమీదుగా యూనిఫాం అంద జేసారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రమాకళ్యాణి, సీడీపీవో రేష్మా, ఎస్సై గో పతి సురేష్‌, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ రవీందర్‌, ఏజీపి సంతోష్‌, న్యాయవా దులు కారుకూరి సురేందర్‌, సత్యగౌడ్‌, గణేష్‌, రేఖ, సురేందర్‌, శివశంకర్‌, నరేందర్‌తోపాటు గురుకులం సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:09 PM