Share News

సీఎంను కలిసిన.. పదోన్నతి పొందిన ఐపీఎస్‌లు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:15 AM

ఇటీవల డీజీలుగా పదోన్నతి పొందిన ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంను కలిసిన.. పదోన్నతి పొందిన ఐపీఎస్‌లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఇటీవల డీజీలుగా పదోన్నతి పొందిన ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు, శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేష్‌ భగవత్‌, హోంగార్డుల విభాగం చీఫ్‌ స్వాతి లక్రా, సీఐడీ చీఫ్‌ చారుసిన్హా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌.. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎంను కలిశారు. వీరి వెంట డీజీపీ శివధర్‌రెడ్డి ఉన్నారు. వీరితో సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు పోలీసింగ్‌ విజన్‌, ప్రభుత్వం ఏం కోరుకుంటుందనే విషయాలను వివరించినట్లు తెలిసింది.

Updated Date - Apr 26 , 2026 | 04:15 AM