ఇచ్చిన హామీలు అమలు చేయాలి...
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:22 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలన్నింటినీ అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంక టేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో బీజేపీ జిల్లా అద్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్
నస్పూర్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలన్నింటినీ అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంక టేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచి పోయినప్పటికీ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవక తవకలు జరిగినట్లు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో రైతు బంధు విడుదల చేస్తున్నామ ని ప్రకటించడం రైతులను మరోసారి మోసం చేయడమేనన్నారు. మంచిర్యాల మార్కెట్ రోడ్డులో రోడ్డు వెడల్పు పేరుతో ఇష్టారీతిన కట్టడాలను, షాపులను కూల్చి వేయడం సరైంది కాదన్నారు. కొంత మంది అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూ లంగా వ్యవవహరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ మే ఏర్పాటు అవుతుందని, సుస్థిరమైన పాలన అందించి అక్రమాలు, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముకేశ్ గౌడ్, బీజేపీ నాయకులు కొయ్యల ఏమాజీ, దుర్గం అశోక్, వెంకటేశ్వర్, ఎనగందుల క్రిష్ణమూర్తి, పట్టి వెంకట కృష్ణ, కమలాకర్ రావు, కుర్ర చక్రవర్తి, సత్రం రమేశ్, బొట్ల సత్యం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.