Share News

గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి..

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:00 AM

గీత కార్మికుల హామీలు నెరవేర్చాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సం ఘం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డి మాండ్‌ చేశారు.

గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి..

జన్నారం, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): గీత కార్మికుల హామీలు నెరవేర్చాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సం ఘం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డి మాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో పాప న్నగౌడ్‌ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీ ల ను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కల్లుగీత కార్మి కులు పడుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ప్రభుత్వం జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికి నాలుగువేల పెన్షన్‌ ఇవ్వాలని కా ర్మికులు ప్రమాదానికి గురైతే పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 20 కోట్ల ఎక్స్‌గ్రేషియా డబ్బులను గీత కార్మికులకు అంద జేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన 25 కోట్ల నిధులను గీత కార్మికుల సంక్షేమానికి కే టాయించాలని అన్నారు. ఈ నెల 18న సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతిని ట్యాంక్‌బం డ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నారు. అనంతరం మండలంలోని కవ్వాల గ్రామంలో సర్వాయి పా పన్నగౌడ్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.

ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రా ష్ట్ర ఉపాధ్యక్షుడు జయ రాములు, జిల్లా అధ్యక్షులు లచ్చాగౌడ్‌,, మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల సాని శ్రీనివాస్‌గౌడ్‌, మండల నాయకులు భాస్కర్‌గౌడ్‌, రవి గౌడ్‌, పోచాగౌడ్‌, తిరుపతిగౌడ్‌, మల్లేశ్‌గౌడ్‌తో పా టు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:00 AM