Share News

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:33 PM

రాష్ట్ర ప్రభుత్వం వి ద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యు వతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, యూత్‌ డిక్లరేషన్‌ను వెం టనే అమలుచేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు దన్నోజు నరేష్‌చారి డిమాండ్‌ చేశారు.

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
నిరసన వ్యక్తం చేస్తున్న బీజేవైఎం నాయకులు

- బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దన్నోజు నరేష్‌చారి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం వి ద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యు వతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, యూత్‌ డిక్లరేషన్‌ను వెం టనే అమలుచేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు దన్నోజు నరేష్‌చారి డిమాండ్‌ చేశారు. శని వారం బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ నెలకు రూ. 4వేల నిరు ద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, రాజీవ్‌ యువవికాసం, విద్యార్థినులకు స్కూటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణాల హామీలను అమలు చేయాలని డిమాం డ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ. 15వేల కోట్లు ఫీజుబకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్‌ ముదిరాజ్‌, రాకేష్‌వర్మ, గోనెల శ్రీశైలం, ప్రవీణ్‌, శ్రీకాంత్‌, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:33 PM