హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:53 AM
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ హమాలీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 24 (ఆంఽధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ హమాలీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని హమాలీ కార్మికులు తరలివచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ హమాలీల కూలీ రేట్లు పెరగడం లేదన్నారు. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హెల్త్‌కార్డులను అందజేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న హమాలీలకు ఇచ్చిన హామీ లను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్య దర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేష్, అధ్యక్షుడు సావనపల్లి రాములు, ఏలిగేటి రాజశేఖర్, గొర్రె మల్లుశం, మాలోత్ కిషన్, మూషం సురేష్, గురజాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.