kumaram bheem asifabad- యూడైస్ ప్లస్‌తో ప్రగతి
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:40 PM
విద్యా వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యూడైస్ ప్లస్(యునిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) వెబ్‌సైట్ పాఠశాలల నిర్వహ ణలో కీలకంగా మారింది. ఇందులో నమోదు అయ్యే వివరాలే నిధుల కేటాయింపునకు అత్యంత ప్రామాణి కంగా కానున్నాయి.
- పాఠశాలల నిర్వహణకు దోహదం
- పథకాల అమలులో పారదర్శకత
- అభివృద్ధికి నిధులు కేటాయింపు
కాగజ్‌నగర్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యూడైస్ ప్లస్(యునిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) వెబ్‌సైట్ పాఠశాలల నిర్వహ ణలో కీలకంగా మారింది. ఇందులో నమోదు అయ్యే వివరాలే నిధుల కేటాయింపునకు అత్యంత ప్రామాణి కంగా కానున్నాయి. ఈ సమాచారం ఆధారంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తోంది. పాఠ్య రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం పంపిణీ వివిధ రకాల నిధులను వెబ్‌సైట్ ఆధారంగా కేటాయిస్తుంటారు. దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాల సూచిక కేటాయింపునకు ఈ వెబ్ సైట్‌లోని సమాచారమే ప్రామాణికంగా కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నారు.
- మార్పులపై..
కాగా వెబ్‌సైట్‌లో జరిగే మార్పులు, చేర్పులు పాఠ శాలల నిర్వహణపై ఎప్పకటిప్పుడు విద్యాశాఖ మార్గనిర్ధేశం చేస్తోంది. ఇప్పటికే ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎం, సీఆర్పీలు ఎఐఎస్ కోఆర్డినేటర్లు, సీపీలోకు జిల్లా కేంద్రంలో వర్క్‌షాప్ కూడా నిర్వ హించారు. అలాగే స్ట్రాంగ్ టీచర్లకు, అన్ని యాజమా న్యాల కింద పని చేస్తున్న ఆశ్రమ ఉన్నత పాఠశాలల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఏకలవ్య మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కలెక్టరేట్‌లో లైన్ డిపార్టుమెంట్లకు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అనంతరం జిల్లాలోని అన్ని మండలాల్లోని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు స్ట్రాంగ్ టీచర్లతో వర్క్‌షాప్‌లను న్విహిస్తారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్‌తో పాటు ఇతర కార్యక్రమాల ఉద్దేశాన్ని వర్క్‌షాపుల్లో అధికారులు వివరించను న్నారు. నూతన కార్యక్ర మాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థు లకు మరింత నాణ్యమైన విద్యను అమలు చేయనున్నారు. కోర్సుల విశేషాలు, అనుబంధ వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వెబ్ సైట్‌లో నమోదైన ప్రతీ విద్యార్థికి పెన్(పర్మినెంటు ఎడ్యుకే షన్ నంబర్) కేటాయించారు. అన్ని రకాల పాఠశా లలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందిన నుంచి ఉన్నత విద్య పూర్తి చేసే వరకు ఈ నంబర్ విద్యార్థికి ఎంతో కీలకం కానుంది.
- 2023 నుంచి నవీకరణ..
కాగా 2021-22 వరకు యూడౌస్‌గా కొనసాగిన వెబ్‌సైట్ 2023 విద్యా సంవత్సరం నుంచి యూడైస్ ప్లస్‌గా నవీకరించారు. యైుడైస్ ప్లస్‌లో రెండు గంటలకొసారి సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని నవీకరిస్తున్నారు. ఈ వెబ్ సైట్‌ను పాఠశాల భౌతిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్‌గా విభజించారు. ఎంఈవో, హెచ్‌ఎంల నేతృత్వంలో నిర్వహణ కొనసాగు తుంది. పాఠశాలల క్రీడా స్థలం ఉందా.. ఎన్ని గదులున్నాయి.. ఇంకా ఏం అవసరం, అలాగే ఫర్మి చర్, ల్యాబ్ ఇతర సౌకర్యాలున్నాయా.. అమలవుతున్న కార్యక్రమాలు తదితర అంశాలు వెబ్‌సైట్ లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. గతేడాది తయారు చేసిన యూడైస్ ప్లస్ వెబ్ సైట్ లో చేరిన నూతన అంశాలపై అవగాహన కల్పిం చేందుకు జిల్లాలోని మండలాల్లో ఆయా పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యా యులకు జిల్లా, మండల కేంద్రాల్లో వర్క్‌షాపులు నిర్వహించనున్నారు.