Share News

ప్రత్యేక శ్రద్ధతో ప్రగతి ప్రణాళిక పనులు చేపట్టాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 10:58 PM

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పను లను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థ లు) చంద్రయ్య సూచించారు. పల్లెల్లో పారిశుధ్య నిర్వహన కోసం మల్టీపర్పస్‌ వర్కర్లతో పాటు అదనంగా రోజుకూలీలను నియమించుకొని పనులు చేయిం చుకోవాలన్నారు. మంగళవారం ఆయన నెన్నెలలో పర్యటించి 99 రోజుల ప్రగ తి ప్రణాళికలో చేపడుతున్న పనులను పరిశీలించారు.

ప్రత్యేక శ్రద్ధతో ప్రగతి ప్రణాళిక పనులు చేపట్టాలి
నెన్నెల వీధుల్లో పారిశుధ్య పనులు పరశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

నెన్నెల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పను లను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థ లు) చంద్రయ్య సూచించారు. పల్లెల్లో పారిశుధ్య నిర్వహన కోసం మల్టీపర్పస్‌ వర్కర్లతో పాటు అదనంగా రోజుకూలీలను నియమించుకొని పనులు చేయిం చుకోవాలన్నారు. మంగళవారం ఆయన నెన్నెలలో పర్యటించి 99 రోజుల ప్రగ తి ప్రణాళికలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయ న మాట్లాడుతూ మురికి కాలువలు, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల న్నారు. రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాలన్నారు. పల్లెల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యా ర్డుకు తీసుకెళ్లి తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చేలా ఏర్పాట్లు చేసుకో వాలని సూచించారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులను పది రోజులకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో బిల్లుల చెల్లిం పుల గూర్చి మాట్లాడారు. నిర్మాణ పనులు సత్వరం పూర్తి చేసి గృహ ప్రవేశా లు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మహమ్మద్‌ అబ్దుల్‌ హై, సర్పంచ్‌ ఎండీ ఇబ్రాహీం, ఎంపీవో శ్రీనివాస్‌, కార్యదర్శి సురేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 10:58 PM