Share News

ప్రగతి ప్రణాళిక పనులు సమర్థవంతగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:20 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. ఆయన నెన్నెల మండలంలో శుక్రవారం పర్యటించారు.

ప్రగతి ప్రణాళిక పనులు సమర్థవంతగా పూర్తి చేయాలి
నెన్నెలలో సెరిగ్రేషన్‌ షెడ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నెన్నెల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. ఆయన నెన్నెల మండలంలో శుక్రవారం పర్యటించారు. నర్సరీ, సెగ్రిగేషన్‌ షెడ్‌లను సందర్శించి, అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, ఎండలు ముదురుతున్న వేళ మొక్కలకు ప్రతినిత్యం నీరుపోస్తూ సంరక్షించాలన్నారు. చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించి తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. స్థానికంగా చెత్త నిర్వహణ విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న కస్తూర్బాగాంధీ అకడమిక్‌ బ్లాక్‌ భవన నిర్మాణం పనులు పరిశీలించారు. పనులు సత్వరం పూర్తి చేసి భవనాన్ని ఉపయోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చిత్తాపూర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలనలు సందర్శించారు. తరగతి గదులు, ఉపాధ్యాయలు, విధ్యార్థుల హాజరు పట్టికలు పరిశీలించారు. విధ్యార్థులతో మాట్లాడరు. వివిధ సబ్‌జెక్టుల్లో ప్రశ్నలు అడిగి పిల్లల సామర్థ్యాన్ని పరీక్షించారు. వెనుకబడిన విధ్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. విధ్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీరు అందించాలని సూచించారు. ఎంపీడీవో మహమ్మద్‌ అబ్దుల్‌ హై; ఎంపీవో శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 11:20 PM