kumaram bheem asifabad- పల్లెల ప్రగతిలో పురోగతి
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:32 PM
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత పల్లెల సమగ్ర స్వరూపం త్వరలోనే అరచేతిలోకి రానుంది. గిరిజన గూడెలు, మారుమూ ల గ్రామాల్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టించేందు కు పారదర్శక పాలనకు బాటలు వేసేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్త వేదికను సిద్ధం చేసింది. జీపీఎస్‌ఏపీ-2026 పేరిట డిజిటల్ ప్రొఫైల్ రూపొందిస్తోంది. తెలంగాణ-2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతీ గ్రామం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది
- ఐదేళ్ల అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ
- పారదర్శక పాలనకు సర్కారు నిర్ణయం
కెరమెరి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత పల్లెల సమగ్ర స్వరూపం త్వరలోనే అరచేతిలోకి రానుంది. గిరిజన గూడెలు, మారుమూ ల గ్రామాల్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టించేందు కు పారదర్శక పాలనకు బాటలు వేసేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్త వేదికను సిద్ధం చేసింది. జీపీఎస్‌ఏపీ-2026 పేరిట డిజిటల్ ప్రొఫైల్ రూపొందిస్తోంది. తెలంగాణ-2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతీ గ్రామం స్వయం సమృద్ది సాధించేలా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గతంలో గ్రామంలో లేదా పంచాయతీ సంబంఽధించిన నిధులు, పథకాల వివరాలు తెలుసు కోవాలంటే ప్రజలు రోజుల తరబడి పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టు తిరుగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యకు తెరదిం చుతూ ఎవరైనా ఇంట్లో నుంచే ఒక్క క్లిక్ చేస్తే సమగ్ర వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వం సాంకే తిక విప్లవానికి నాంది పలికింది.
- విస్తారమైన అటవీ ప్రాంతాలతో
కొండలు, కోనలు, విస్తారమైన అటవీ ప్రాంతాల తో కూడిన జిల్లాలోని 15 మండలా ల్లో 335 గ్రావ పంచాయతీయిన్నాయి. కెరమెరి, తిర్యాణి, జైనూర్, లింగాపూర్, సిర్పూర ు(యు), వాంకిడి లాంటి ఏజెన్సీ మండలాల్లో గిరిజన పల్లెలకు ఈ డిజిట లైజేషన్ ఎంతో మేలు చేయనుంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల కొలం గూడెలు నాయకపోడు, గోండు, ఆవాసాల్లో అభివృద్ధి పనుల ప్రగతిని జిల్లా ఉన్నతాధికారులు హెడ్ క్వార్టర్స్ నుంచే నిరంతంగా పర్యవేక్షించవచ్చు. నిధులు, జలనిధి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, విలేజ్ ఆర్గనైజేషన్ భవన నిర్మాణాలు తదితరులు పనుల వివరాల ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. బీవీజీరా మ్‌జీకి సంబంధించిన కూలీలు, పని దినాలు, చెల్లింపులు వివరాలు, అంగన్‌వాడి నిర్వహ ణ తదితర అంశాలపై పారదర్శకత రానుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వెబ్‌సైట్, డిజిటల్ డ్యాష్ బోర్డు అందుబాటులోకి వస్తోంది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు, గ్రామస్థుల పేర్లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. పాలన పరమైన వివరాలే కాకుండా గ్రామంలో విశిష్ట, చారిత్రాత్మక అంశాలు, సాంస్కృ తక విశేషాలు, పర్యాటక ప్రదేశాలు, మ్యాపులను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
- ఎక్కడ ఉన్నా..
ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా తమసొంత ఊరి వివరాలు వివరాలు చూసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కలుగనుంది. ఈ పోర్టల్‌లో చారిత్రా త్మక కట్టడాలు, దర్శనీయ ప్రదేశాలు, ఆలయాలు ఫోటోలు మాత్రమే అప్‌లోడ్ చేయనున్నారు. కాని ఈ ఫోటోలకు సంబందించిన ఇంకా వివరాలు పొందుపర్చాల్సి ఉంది. వీటి విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల్లో పారదర్శకత పెంచడం, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ప్రతి జీపీకి డిజిటల్ డేటాను క్రోడీకరించటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. గ్రామంలో మొత్తం జనాభా, కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, గృహ వసతి, తాగునీరు వసతి, పశు సంపద లాంటి వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఎవరెవరికి అందుతున్నాయి. పథకాలు అందని అర్హులెవరు..? అనే పూర్తి సమాచారాన్ని ఒక్క చోట నే అందుతున్నాయి. పథకాలు అందని అర్హులెవరు అనే పూర్తి సమాచారాన్ని ఒక్కచోటే పొందుపరు స్తారు. రానున్న ఐదేళ్లలో సంబంధించి ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతులు అభివృద్ధి లక్ష్యాలను పక్కాగా నిర్ధేశిస్తారు.
శంకర్ లోద్ధి..
కెరమరి మండలంలోని శంకర్‌లోద్దిలో ప్రతి ఉగాది పండుగను పురస్కరించుకొని వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రేంసింగ్ రామారావు మహారాజ్ తపస్సు చేసిన పుణ్య స్థలం, కాకతీయ కాలంగా ఉ న్న శివాలయం గుర్తింపుగా ఉంది. నేటికి అంతంత మాత్రంగానే అభివృద్ధి సేవాలాల్ దీక్షలు స్వీకరి స్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సేవాలాల్ భారీ కార్యక్రమం చేపడుతారు. మండలంలోని జోడెఘాట్‌లో మ్యూజియంతో, పర్యాటక కేంద్రానికి సంబంధించిన అంశాలను ఈ సైట్‌లో కీలక ఘట్టంగా పొందుపరిచారు. దేశ స్థాయిలో గుర్తింపు రావడం విశేషం. గిరిజనుల హక్కుల కోసం పోరాడి అమరుడైన భీం జీవిత చరిత్ర కూడా ఈ సైట్‌లో పొందు పర్చనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే వనరులు, ఇతరాత్ర కూడా పొందుపర్చారు.
వందశాతం నమోదు పూర్తి..
- భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి
పోర్టల్‌లో వివరాలు నమోదు ప్రక్రియ వందశా తం పూర్తి చేశాం. జిల్లా డిజిటలైజేషన్‌లో ముందం జలో నిలిపేలా పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో పని చేసి గడువుకు ముందే పూర్తి చేశారు. పోర్టల్ ద్వారా పల్లెల్లో పాలనలతో సరికొత్త జవాబుదారీతనం కన్పిస్తోంది. గ్రామ పంచాయతీకి చెందిన అన్ని వివరాలు పోర్ట ల్‌లో కనిపించనున్నాయి.