kumaram bheem asifabad- ఆయిల్‌పామ్ సాగులో లాభాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:39 PM
ఆయిల్‌పామ్ సాగు ద్వారా లాభాలు పొందాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆరెగూడలో బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి, పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు
కాగజ్‌నగర్ , అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగు ద్వారా లాభాలు పొందాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆరెగూడలో బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి, పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. యాసంగిలో మొక్క జొన్న, జొన్న, పెసర, పుచ్చకాయలు, కూరగాయాలు తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఎల్నీనో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ధాన్యం, మొక్క జొన్న, పత్తి పండించే రైతులకు పూర్తి మద్దతు ధర లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తద్వార రైతంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీంకార్ పద్మ, మార్కెట్ కమిటి చైర్మన్ సుద్దాల దేవయ్య, జిల్లా వ్యవసాయా అధికారి డాక్టర్ వెంకట్, ఏడీఓ మనోహర్, ఏఓ రామకృష్ణ, వ్యవసాయ శాస్త్ర వేత్త మధుబాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నదీం, సుప్రియతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో లైఫ్ లైన్‌ఎక్స్‌ప్రెస్ (రైలు పట్టాలపై వైద్యశాల) సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. బుధవారం డీఎంహెచ్‌వో డాక్టర్ సిడాం నాగేంద్రతో కలిసి లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి నవంబరు 4 వరకు ఔట్ పేషంట్లకు వైద్య సేవలు, ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా వాసులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి ఆపరేషన్లు, పిల్లలకు సంబంధించిన ఎముకల ఆపరేషన్లు, చెవి మక్కు, గొంతు, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్‌కు సంబంధించిన సేవలు ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహకులు డాక్టర్ మనోహర్ రెడ్డి, యోగేష్ నాయ కులు వీరభద్రచారి, హన్మంతరావు, అరుణ్ కుమార్, పెద్ది హరీష్, సాయికుమార్, పవన్ బల్దువా తదితరులు పాల్గొన్నారు.