Share News

ఽకొనుగోళ్లు సరే...ధాన్యం దించేదెట్లా..?

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:37 PM

ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో వరి కొనుగోలు కేంద్రాల ద్వా రా సేకరించే ధాన్యాన్ని నిల్వ చేయడంలో సంబంధిత అధికారులకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు.

ఽకొనుగోళ్లు సరే...ధాన్యం దించేదెట్లా..?

-సీఎంఆర్‌ బకాయిలతో డిఫాల్టర్లుగా రైస్‌ మిల్లర్లు

-గోదాముల్లో వేధిస్తున్న స్థలం కొరత

-ఇతర జిల్లాలకు తరలింపుతో పెరగనున్న దూర భారం

-వరి కొనుగోళ్లకు సమాయత్తం అవుతున్న పౌరసరఫరాల శాఖ

మంచిర్యాల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో వరి కొనుగోలు కేంద్రాల ద్వా రా సేకరించే ధాన్యాన్ని నిల్వ చేయడంలో సంబంధిత అధికారులకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు. ఓ వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమాయాత్తం అవుతున్న అధికారులు...రైతుల నుంచి సేకరించిన ధా న్యాన్ని ఎక్కడ దింపి నిల్వ చేయాలో తెలియక సత మతమవుతున్నారు. సాధారణంగా కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించి, నిల్వచేస్తుంటారు. అయితే ఈ సీజన్‌కు సంబంధించి సరిపడా రైస్‌ మిల్లులు అందుబాటులో లేకుండా పో యాయి. గతంలో సీఎమ్మార్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) కిం ద ధాన్యం పొందిన మిల్లర్లు పెద్ద మొత్తంలో వాటిని పక్కదారి పట్టించగా, పరిశీలించిన జిల్లా ఉన్న తాధికా రులు సంబంధిత రైస్‌ మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసు లు ఎదుర్కొంటున్న మిల్లులకు గత ఏడాది కాలంగా సీఎమ్మార్‌ కోటాను జిల్లా పౌరసరఫరాల శాఖ ధికా రులు నిలిపివేస్తున్నారు. దీంతో నాలుగైదు సీజన్‌లుగా ధాన్యం నిల్వ చేసేందుకు నానా తంటాలు పడుతు న్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్షా 44వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో సకా లంలో వర్షాలు కురువక వరిసాగు దిగుబడిపై ప్రభా వం చూపనుంది. దిగుబడిలో ఈ సీజన్‌లో కనీసం 20 శాతం మేర తగ్గుదల ఉంటుందని వ్యవసాయశాఖ అ ధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉ న్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పై చిలుకు మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వస్తుందన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. దిగుబడి అంచనా మేర కు జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వ ర్యంలో మొత్తం 117 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.

గత సీజన్‌ అనుభవంతో అప్రమత్తం....

ఈ ఏడాది రబీ సీజన్‌లో ధాన్యాన్ని నిల్వ చేసేం దుకు సరియైన వసతులు లేని కారణంగా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిపడినన్ని రైస్‌ మిల్లులు అందుబాటులో లేకపోవడం, కేవలం గోదాముల కొరత కారణంగా గత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఆల స్యంగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అదే సీన్‌ రిపీట్‌ అయ్యే అవకాశాలు అనేకం ఉన్నాయి. గత సీజన్‌ మాదిరిగానే ఇప్పుడు కూడా సీఎంఆర్‌ జియో ట్యాగింగ్‌ పొందిన రైస్‌ మిల్లుల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఇక గోదాముల సామర్థ్యం పరిశీలిస్తే ధాన్యం ది గుబడికి తక్కువగా ఉంది. దీంతో ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్‌లో అప్పటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టే యోచనలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 54 రైస్‌ మి ల్లులు ఉండగా, వాటిలో బాయిల్డ్‌-19, రా రైస్‌ మిల్లులు 35 ఉన్నాయి. వాటిలో సీఎంఆర్‌ అనుమతులు 32 మిల్లులకు ఉన్నాయి. గతంలో సీఎంఆర్‌ పెండింగ్‌ ఉం దంటూ జిల్లాలోని సింహభాగం మిల్లులకు ఈ సీజ న్‌లో జియో ట్యాగింగ్‌ ఇవ్వలేదు. సీజన్‌కు సంబంధిం చి ఇప్పటి వరకు ఎనిమిది రైస్‌ మిల్లులకే జియో ట్యాగింగ్‌ ఇవ్వగా, అందులో బాయిల్డ్‌-07 మిల్లులు, రా మిల్‌ -01 ఉంది. ఆ ఎనిమిది మిల్లుల సామర్థ్యం కేవలం 46 వేల మెట్రిక్‌ టన్నులేని అంచనా.

పొరుగు జిల్లాలే దిక్కు....

ధాన్యం దిగుబడికి సరిపడా గోదాలు అందుబా టులో లేకపోవడంతో ప్రతియేడు లాగానే ఈ సారి కూడా పొరుగు జిల్లాలపై ఆధారపడక తప్పని పరిస్థి తులు నెలకొన్నాయి. జిల్లాలో రైస్‌ మిల్లులు, గోదాము ల సామర్థ్యం మేరకు నిల్వ చేయగా, మిగిలిన ధాన్యా న్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గత కొంతకా లంగా పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలపై ఆధారపడు తున్నారు. గత సీజన్‌లలో ఆయా జిల్లాల్లోని రైస్‌ మి ల్లులను జిల్లాకు కేటాయిస్తూ ఒక్కో మిలుకు 50వేల మెట్రిక్‌ టన్నుల చొప్పున జియో ట్యాగింగ్‌ ఇచ్చారు. పై రెండు జిల్లాలతోపాటు జిల్లాలో కలిపి మొత్తంగా లక్షా 50వేల మెట్రిక్‌ టన్నుల కంటే మించదు. ఇవిపోను జిల్లాలోని గోదాముల్లో మరో మూడు వేల మెట్రిక్‌ టన్నుల వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో ఇంచు మించు రెండు లక్షల పై చి లుకు మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చినా.....మిగతా ధాన్యం ఎక్కడ నిల్వ చేస్తారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలియక కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించారనే అపవాదు ఉంది. పైగా వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇతర జిల్లాల్లోని రైస్‌ మిల్లుల కు జియో ట్యాగింగ్‌ ఇవ్వడం వల్ల దూరభారం పెరు గుతుంది. ఈ కారణంగా ధాన్యం రవాణాలో ఆలస్యం జరిగి సకాలంలో కొనుగోళ్లు జరుగక కొనుగోలు కేం ద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గోదాముల వేటలో...

మంచిర్యాల జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరిపంట, పలు మిల్లులపై క్రిమినల్‌ కేసులు ఉన్నందున ధాన్యం ఎక్కడ నిలువ చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నం అవు తున్నాయి. జిల్లాలో సీఎమ్మార్‌ ఇవ్వని 25 మిల్లులపై అధికారులు కేసులు బుక్‌ చేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం ఆయా మిల్లుల యజమానుల నుంచి ధాన్యం సొమ్మును కూడా కొంత వరకు రికవరీ చేశా రు. అభియోగాలు ఎదుర్కొంటున్న మిల్లర్లకు దాన్యం ఇవ్వవద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వాటిని పక్కన బెట్టక తప్పలేదు. దీంతో అధికారులు గోదా ముల వేటలో తలమునకలు అవుతున్నట్లు తెలుస్తోం ది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత సన్నరకాలకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. 2026-27 సంవత్సరానికి గాను కేంధ్రం ప్రకటించిన మేరకు వరి పంటకు మద్దతు ధర క్వింటాకు గ్రేడ్‌-ఏ రకం రూ. 2461 ఉండగా, కామన్‌ వెరైటీ ధర రూ. 2441 ఉంది. ఇందులో సన్నరకం సా గుకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా అదనంగా రూ. 500 బోనస్‌ రైతులకు అందనుంది. బోనస్‌తో కలిపి నిర్ణయించిన మద్దతు ధర దాదాపు రూ. 3వేల వరకు అందనుంది. దీంతో మెజార్టీ రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో సన్నరకం సాగువైపే మొగ్గు చూపారు. బోనస్‌ అందు తుండటంతో పంటను రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్ర యించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేయడం అధికారులకు సవాలుగా మారనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 27 , 2026 | 11:37 PM