kumaram bheem asifabad-సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:13 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములై సమస్యలను గుర్తించి అక్కడిక్కడే పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, మున్సిపల్ చైర్మన్‌లు షాహీన్ సుల్తానా, మెంగ్రె ఆకాష్‌లతో కలిసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
ఆసిఫాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములై సమస్యలను గుర్తించి అక్కడిక్కడే పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, మున్సిపల్ చైర్మన్‌లు షాహీన్ సుల్తానా, మెంగ్రె ఆకాష్‌లతో కలిసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో సర్పంచ్‌లు, కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని తెలిపారు. సర్పంచ్‌లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని ప్రతి శాఖకు అధిపతులను, తాము పొందిన పదవులు బాధ్యతాయుతమైనవని అన్నారు. తమ పరిధిలోని ప్రతి సమస్యను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిఽధులతో తమ పరిధిలోని పారిశుధ్యం, వీధీ దీపాలు, తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. భూగర్భ నీటి మట్టాన్ని పెంచే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఏప్రిల్ 2న ప్రతి గ్రామ పంచాయతీ, వార్డులో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. జూన్ 12 వరకు జరుగనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం, సురక్షిత ప్రయాణం, సంక్షేమ పథకాల అమలు, చిన్న పిల్లల భద్రత, మాదకద్రవ్యాల కట్టడి, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, యువజన క్రీడలు, సేవలు, మహిళల సంక్షేమం, పర్యావరణ రక్షణ వంటి పది అంశాలపై ప్రణాళిక రూపొందించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడా రు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారా వు, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, మున్సి పల్ వైస్ చైర్మన్ అహ్మద్, అనిత తదితరులు పాల్గొన్నారు.