Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:29 PM

వీబీజీ రామ్‌జీ కథకంలో పని చేస్తున్న సాంకేతిక సహాయకుల స మస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.

సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌కు వినతిపత్రం అందజేస్తున జేఏసీ నాయకులు

- కలెక్టర్‌కు ఉద్యోగుల వినతి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ కథకంలో పని చేస్తున్న సాంకేతిక సహాయకుల స మస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న తమకు పే స్కేలు అమలు చేయాలని, ప్రతీ నెల ఒకటో తే దీన జీతాలు చెల్లించాలని కోరారు. ఒక సాంకే తిక సహాయకుడు 5 నుంచి 8 గ్రామాల బాధ్య తలు నిర్వహించాల్సి వస్తోందని, సాంకేతిక పరి కరాల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నా యని తెలిపారు. కార్యక్రమంలో వివిధ మం డలాల ఉపాధి హామీ పథకం ఏపీవోలు, ఈసీ లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరే టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:29 PM