Share News

సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:18 AM

అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే విధుల బహిష్కరణ, సమ్మెకు వెళ్లక తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కమిషనర్‌ ఖదీర్‌పాషాకు సిరిసిల్ల మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌

 సమస్యలు పరిష్కరించాలి
కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే విధుల బహిష్కరణ, సమ్మెకు వెళ్లక తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కమిషనర్‌ ఖదీర్‌పాషాకు సిరిసిల్ల మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న కార్మికుల సమస్యలను మున్సిప ల్‌ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్మికులకు ఇవ్వాల్సిన బట్టలు, చెప్పు లు, సబ్బులు, గ్లౌజులు ఇతర సామగ్రి అందించాలని డిమాండ్‌ చేశారు. 60 సంవత్సరాలు పైబడిన, విధులో ఉండగా వివిధ కార ణాలతో చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని సభ్యులను పనిలోకి తీసుకోకపోవడం వలన మున్సిపల్‌లో కార్మి కుల సంఖ్య తగ్గి ఇతర కార్మికులపై పనిభారం పెరిగిందని అన్నారు. మున్సిపల్‌ పాలకవర్గం కౌన్సిల్‌లో చర్చించి అదనంగా కార్మికులను నియమించి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై అదనపు భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల కుటుం బ సభ్యులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. 2009 నుంచి 2012 వరకు కార్మికుల పెండింగ్‌ పీఎఫ్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంకా కొంత మంది కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌ సమస్యలు, ఈఎస్‌ఐ సమస్యలను కూడా పరిష్కరించాలని కార్మికులందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని అన్నా రు. పాలకవర్గం కౌన్సిల్‌ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో యూనియన్‌ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణతో పాటు సమ్మెకు వెళ్తామని అన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కాసర్ల శంకర్‌, పట్టణ అధ్యక్షుడు ఏల్పుల బాలయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2026 | 12:18 AM