’ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’తో సమస్యలకు చెక్...!
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:26 PM
గ్రామ పంచా యతీలు, మునిసిపాలిటీల్లో ప్రజల కనీస సౌకర్యాలైన పారి శుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ దీపాల పనితీరు మెరుగు పరచడం ద్వారా వార్డుల వారీగా సమస్యలు పరిష్కరిం చేందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిం చిం ది.
-మునిసిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక ప్రణాళిక
-సానినేటషన్, వాటర్ సప్లై, విద్యుత్ సమస్యలకు పరిష్కారం
-క్లస్టర్ల వారీగా పనులు చేపట్టేలా ప్రత్యేక కార్యాచరణ
-మంచిర్యాల కార్పొరేషన్‌లో స్పెషల్ డ్రైవ్
-రోజుకు మూడు డివిజన్లలో ప్రత్యేక కార్యాచరణ
మంచిర్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచా యతీలు, మునిసిపాలిటీల్లో ప్రజల కనీస సౌకర్యాలైన పారి శుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ దీపాల పనితీరు మెరుగు పరచడం ద్వారా వార్డుల వారీగా సమస్యలు పరిష్కరిం చేందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిం చిం ది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’’ప్రజాపాల న-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుం చి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల స్పెషల్ డ్రైవ్ చేప డుతుండగా, శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జి ల్లా స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీలు, మునిసి పాలిటీ లతోపాటు కార్పొరేషన్ పరిధిలో ప్రణాళిక అమలు చేయను న్నారు. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సంక్షేమశాఖ, వెను కబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకం గా ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యవ సాయ రంగంలో నూతన పోకడలపై శాస్త్రవేత్తలతో రైతుల కు అవగాహన కల్పించడం, ప్రజారోగ్యంపై ప్రత్యేక కార్యాచ రణ, తదితర పనులు చేపట్టనున్నారు.
కార్పొరేషన్‌లో ప్రత్యేక డ్రైవ్...
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికకు అ దనంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అధికారులు ప్ర త్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా 40 రోజుల ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వ ప్రణాళికతోపాటే కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నారు. కార్పొరేషన్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్‌తోపాటు వార్డు ఆఫీసర్లు, డివిజన్ కార్పొరేటర్‌ల నేతృత్వంలో ప్రత్యేక సిబ్బందితో పారిశుధ్యం, తాగునీటి స రఫరా, వీదిలైట్లు అమర్చడం వంటి పనులు చేపడుతు న్నా రు. ఇందు కోసం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ప్ర త్యేక ప్రణాళిక అమలు చేయనున్నారు. ఒక్కో డివిజన్‌కు రెండు రోజులు కేటాయించడం ద్వారా ప్రతి రోజూ మూడు డివిజన్ల చొప్పున పనులు చేపట్టనున్నారు. ప్రణాళికలో భా గంగా డివిజన్ల వారీగా నాళాలు శుభ్రపరచడం, ఖాళీ స్థలా ల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడం, ఇంటింటా చెత్త సేకరణ, రోడ్ల మరమ్మతు లు, వీధి దీపాలు అమర్చడం వంటి పనులు చేపడుతు న్నారు. క్లస్టర్ల వారీగా పనుల ప్రణాళిక సిద్ధం చేయగా, కా ర్పొరేషన్‌లో విలీనం అయిన మంచిర్యాల, నస్పూర్, ఆరు గ్రామ పంచాయతీలలో రోజుకు మూడు చోట్లా డివిజన్లను ఎంపిక చేశారు.
ప్రత్యేక సిబ్బంది నియామకం....
కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ అమలు చే సేందుకు కొత్తగా 90 మంది పారిశుధ్య కార్మికులను విధు ల్లోకి తీసుకున్నారు. డైలీ వేజెస్ రూ. 575తో పనులు చేసేం దుకుగాను సిబ్బందిని నియమించారు. ప్రణాళికలో భాగం గా ప్రతిరోజు చేపట్టబోయే మూడు డివిజన్లలో ఒక్కో డివి జన్‌కు 30 మంది చొప్పున విధులు కేటాయించనున్నారు. ప్రత్యేక సిబ్బందితోపాటు రెండు జేసీబీలు, ఒక బ్లేడ్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం ద్వారా అవసరంలేని చెట్టు, పొదలు తొ లగించడం, రహదారులను శుభ్రం చేయడం వంటి పను లు చేపట్టనున్నారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి...
కమిషనర్ అన్వేష్
’ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కార్పొరేషన్ లో పరిధిలో 40 రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, అమ లు చేస్తున్నాం. ప్రత్యేక కార్యాచరణలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌కు రెండు రోజులు కేటాయిస్తున్నం దున ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి. డివిజన్లలో నె లకొన్న సమస్యలను వార్డు ఆఫీసర్లు, కార్పొరేటర్ల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అధికారులు, సిబ్బందికి సహకరించడం ద్వారా డివిజన్లలో చేపట్టే పను లు సక్రమంగా జరిగేలా ప్రజలు చేయూతనందించాలి. సం బంధిత అధికారులు, సిబ్బంది సైతం పనులు పకడ్బంధీగా చేపట్టడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.