డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:31 AM
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు ప్రత్యామ్నాయ సూచనలు అద్భుతంగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కితాబిచ్చారు.
రేవంత్‌పై ప్రియాంక ప్రశంసల జల్లు
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు ప్రత్యామ్నాయ సూచనలు అద్భుతంగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కితాబిచ్చారు. బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంలో రేవంత్ కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. న్యూఢిల్లీలో తనతో రేవంత్ సమావేశమైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దక్షిణాదితోపాటు ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అండగా నిలిచినందుకు ప్రియాంకకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాదిని బలహీన పరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్యాంగ సవరణను అడ్డుకోవడంలో ప్రియాంక పాత్ర కీలకమని రేవంత్ కొనియాడారు. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో రాహుల్, ఖర్గేలకు అండగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు.