Teacher misconduct: కీచక టీచర్‌కు దేహశుద్ధి
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:34 AM
విద్యా బుద్ధులు నేర్పించి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ అధినేతనే ఓ విద్యార్థిని పట్ల కీచకుడిగా మారాడు..
అదనపు క్లాసుల పేరుతో..విద్యార్థినులతో వికృత చేష్టలు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
పేట్‌బషీరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): విద్యా బుద్ధులు నేర్పించి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రైవేటు విద్యాసంస్థ అధినేతనే ఓ విద్యార్థిని పట్ల కీచకుడిగా మారాడు. 10వ తరగతి విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబా ద్‌లోని జగద్గిరిగుట్టలో జరిగింది. చంద్రగిరినగర్‌లోని నిస్సీస్వాతి ప్రైవేట్ పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అదనపు తరగతుల పేరిట ఆ విద్యార్థినిని పాఠశాల భవనంపైనే ఉన్న తన నివాసానికి పిలిపించుకునేవాడు. అక్కడ ఆమెతో ఇంటిప నులు చేయించుకోవడమే కాకుండా, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే, కొద్దిరోజులుగా ఆ బాలిక ముభావంగా ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరాతీయ గా, విజయ్‌కుమార్ చేస్తున్న నిర్వాకం బయటపడింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం పాఠశాలపై దాడి చేశారు. జరిగిన విషయంపై ప్రధానోపాధ్యాయుడిని నిలదీయగా.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతనికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకు న్న సీఐ వెంకటేశం ఘటనా స్ధలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనపై విద్యార్థిసంఘాలు మండిపడ్డాయి. ప్రైవేటు పాఠశాలలను అధికారులు సరిగ్గా తనిఖీ చేయడంలేదని ఆరోపించాయి. దీనిపై స్థానిక ఎంఈవో జెమినీ కుమారి స్పందించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు.