kumaram bheem asifabad- ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:12 PM
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయా ఆధికారి బి.వెంకట్ తెలిపారు. గురువారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు
కౌటాల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయా ఆధికారి బి.వెంకట్ తెలిపారు. గురువారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. చెరువులు, కుంటలు పూర్తిగా నిండని పరిస్థితుల్లో వరి సాగు చేసి ఇబ్బందులు పడొద్దని సూచించారు. వరి పొలాల్లో అధిక సాంద్రత మవిధానంలో పత్తిసాగు చేయాలని, ఈ నెలాఖరు వరకు కంది విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం పత్తి పంటలో 200 లీటర్ల నీటిలో 4 కిలోల యూరియా లేదా 19-19-19 నీటిలో కరిగే ఎరువను పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బి.నాగరాజు, వ్యవసాయ విస్తరణ అదికారులు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయా ఆధికారి బి.వెంకట్ తెలిపారు. గురువారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి వర్షాలు అనుకున్న స్థాయిలో కురియక పోవటంతో ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనట్టు తెలిపారు. రైతులు వరికి బదులు కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. చెరువులు, కుంటలు పూర్తిగా నిండని పరిస్థితుల్లో వరి సాగు చేసి ఇబ్బందులు పడొద్దని సూచించారు. ఈ నెలాఖరు వరకు కంది విత్తనాలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గిరీషన్‌తో పాటు సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.