ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:07 PM
జిల్లాలో గర్భిణుల, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు, ఏఎన్‌ఎమ్ లకు ఆదేశాలు జారీ చేశారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గర్భిణుల, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు, ఏఎన్‌ఎమ్ లకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరే ట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ నిర్ధారణ నిషేధం) చట్టం 1994, నిబంధనలు, 1996 పీసీఅండ్‌పీ ఎన్‌డీటీ యాక్ట్ 1994 నిబంధనలపైన జిల్లాలోని అన్ని ప్రభుత్వ పీహెచ్‌సీల ఏఎన్‌ఎమ్‌లకు ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్ట ర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గర్భిణికి అవస రమైన వైద్యపరీక్షలు నిర్వహించడం ద్వారా హైరిస్కు గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి ప్రత్యేక వైద్య సేవలందించాలని సూచిం చారు. మతృ, శిశు మరణాలను తగ్గించడంలో ముందస్తు జాగ్రత్తలే అత్యంత కీలకమైందని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థాయిలో పని చేసే ఏఎన్‌ఎమ్‌లు గర్భిణులతో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లాలోని ఏదైనా స్కా నింగ్ సెంటర్‌లో అబా ర్షన్లు లింగస్థ పరీక్షలు ని ర్వహించనున్నట్లు తెలిస్తే నేరుగా తన దృష్టికి తీ సుకురావాలని కలెక్టర్ ఏఎన్‌ఎమ్‌లకు సూ చించారు. జిల్లాలో బాలికల శాతం గణనీయం గా తగ్గిందని, 1000మంది బాలురకు 894 మం ది బాలికలు ఉన్నారని, ఈ నిష్పత్తి ఇలాగే కొన సాగితే చాలా నష్టం వాటిల్లుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డీఎం హెచ్‌వోలు డాక్టర్ తారాసింగ్, భీమ్లానాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ కృష్ణ మోహన్, డాక్టర్ రఫీక్ పాల్గొన్నారు.
లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి
బిజినేపల్లి, (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బదావత్ సంతో ష్ సూచించారు. మండలంలోని పాలెంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కిసాన్ మేళా, పంట ప్రదర్శన అవగాహన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతులు వానాకాలంలో అధిక సాంద్రతలో పత్తి సాగు చేపడితే అధిక దిగుబడితో పాటు ఆర్థి కంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ప్రతీ సారి ఒకేరకమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానం అవలంభించాలని తెలి పారు. ప్రభుత్వం అయిల్‌పామ్ సాగును ఎక్కు వగా ప్రోత్సహిస్తుందని, ఎకరాకు రూ.51వేల రా యితీతో మొక్కలు, డ్రిప్, మెయింటెనెన్స్ ఖర్చు, పాంఫాండ్స్ ఏర్పాటుకు సహకరిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్, కేవీకే శాస్త్ర వేత్తలు డాక్టర్ సుహాసిని, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఒంగోలు శైల, డాక్టర్ ఆదిశంకర్, జిల్లా హార్టిక ల్చర్ అధికారి వెంకటేశం, ఏడీఏ పూర్ణచంద్రా రెడ్డి, ఏవో కమల్ కుమార్ తదితరులు ఉన్నారు.