విద్యారంగానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:31 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సా రథ్యంలోని విద్యారంగానికి ప్ర భుత్వం ఎంతో ప్రాధాన్యతని స్తోందని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు.
- ఎస్టీయూ 80 వసంతాల వైభవోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్, న వంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సా రథ్యంలోని విద్యారంగానికి ప్ర భుత్వం ఎంతో ప్రాధాన్యతని స్తోందని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. శని వారం జిల్లా కేంద్రంలోని ఎస్ జేఆర్ పంక్షన్‌హాలులో రాష్ట్రో పాధ్యాయ సంఘం (ఎస్టీయూ) 80 వసంతాల వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎస్టీ యూ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీధర్‌రావు అధ్యక్ష తన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అ తిథులుగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు డీ ఈవో రమేష్‌కుమార్, ఎస్టీయూరాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేం దర్‌హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చే యాలని సూచించారు. ప్రభుత్వానికి నిర్మాణా త్మక సూచనలు అందిస్తూ విద్యా వ్యవస్థ అభి వృద్ధికి సహకరించాలని కోరారు. రాబోయే గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు మద్దతు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూద న్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సయ్యద్ సాబేర్ అలీ, పూర్వ అధ్యక్షుడు ఎం.పర్వత్‌రెడ్డి, సతీష్, అనిల్ కుమార్‌రెడ్డి, డి.ప్రభాకర్, ఎస్.ఈశ్వర్, రాఘు రాంరెడ్డి, సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి, నర సింహ, నందకిషోర్‌యాదవ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు, సంఘం విశ్రాంత నాయకులు తదితరులు పాల్గొన్నారు.