Share News

kumaram bheem asifabad-దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:55 PM

ష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాదాన్యం ఇస్తుందని, వారికి అవసరమైన సదరం వైకల్య ఽధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం
డియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ హరిత, అధికారులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) :రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాదాన్యం ఇస్తుందని, వారికి అవసరమైన సదరం వైకల్య ఽధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సదరం ధృవీకరణ పత్రాల జారికి సగటున 75 రోజుల సమయం పడుతుందని ఈసమయాన్ని 30 రోజులకు తగ్గించేలా అన్ని జిల్లాలు ప్రత్యేక కార్యచరణ రుపొందించి అమలు చేయలన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయపాలనతో సేవలందించాలని గిరిజన మారుమూల దూరప్రాంతాలలో నివసించేదివ్యాంగుల సౌకర్యార్థం మండల స్థాయిలోనే ప్రత్యేక సదరం వైద్య శిబిరాలను నిర్వహించలన్నారు. జిల్లాలో సదరం కేంద్రం పునరుద్దరణ పనుల కోసం రూ. 43 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీపీఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 10:55 PM