kumaram bheem asifabad- ధరల మంట
ABN , Publish Date - May 31 , 2026 | 11:15 PM
కూరగా యల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇతర నిత్యావసరాల ధరలు విపరీ తంగా పెరుగుతుండగా కూరగాయల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యు లు, పేద ప్రజలు విలవిలలాడుతున్నారు
- వారం, పది రోజుల్లోనే రెట్టింపు
- వర్షాలు లేక దెబ్బతిన్న పంటలు
- ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో మరింత భారం
- కొనలేక సామాన్యులు, పేదలు విలవిల
బెజ్జూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): కూరగా యల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇతర నిత్యావసరాల ధరలు విపరీ తంగా పెరుగుతుండగా కూరగాయల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యు లు, పేద ప్రజలు విలవిలలాడుతున్నారు. ధరలు ఇలా ఉంటే కొనేదెట్టా?తినేదెట్టా? అంటూ బెంబేలెత్తిపోతున్నారు. వారం, పది రోజుల్లోనే మార్కెట్‌లో కూరగాయల ధరలు రెట్టింపవడంతో మార్కెట్‌కు రూ.500నోటు తీసుకెళితే కనీసం వారం రోజులకు సరిపడా కూరగాయలు రాని పరిస్థితి ఉంది. ముఖ్యం గా సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే టమాట కిలో రూ.70పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు రూ.40వరకు లభించిన టమాట ఇప్పుడు డబుల్ కావడంతో వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గకపోవడం లాంటి కారణాలతో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కూరగాయల పంటలు సాగుచేసేవారి సంఖ్య తగ్గడం, ఒకవేళ సాగు చేసినా దిగుబడి తగ్గిపోతుం డడం కూడా కారణమవుతోంది. ఎప్పుడూ స్థానికంగా దొరికే కొత్తిమీర గతంలో కట్టకు రూ.50ఉంటే, ప్రస్తుతం రూ.150నుంచి రూ.200 పలుకుతోంది. ప్రస్తుతం కొత్తిమీర ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుం టున్నారు. ఇక ఆకు కూరలు మాత్రమే స్థానికంగా పండిస్తున్నారు. వాటి ధరలు కూడా రూ.100కు తక్కువగా లేదు. ప్రతీ రోజు కూరగాయలకే రూ.100ఖర్చు చేయాల్సి వస్తే తమ పరిస్థితేంటని దినసరి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- జిల్లాలో తగ్గిన సాగు..
జిల్లాలో అత్యధికంగా రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతుండడం, కూర గాయల సాగుపై ఎక్కువగా ఆసక్తి లేకపోవ డంతో సాగు అమాంతం తగ్గిపోయింది. జిల్లా లో ఈస్‌గాం, బెజ్జూరు, కౌటాల, చింతల మానేపల్లి, కాగజ్‌నగర్ తదితర మండలాల్లోనే కూరగాయల సాగు చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి తదితర ప్రాంతాల్లో కూరగాయల సాగు చేస్తుంటారు. ఏటా వర్షాకాలంలో కూరగాయల సాగు పూర్తిగా తగ్గిపోతుండటం ప్రస్తుతం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతా ల్లో పంట సాగుకు మొగ్గుచూపినా వాతావ రణం అనుకూలించక పంటలు దెబ్బతి న్నాయి. దీంతో వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలోచ్చాయి.
- ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కూరగాయల ధరలు చూసినా విపరీతంగా మండుతున్నా యి. సామాన్య జనానికి అందుబాటులో లేని ధరలు ఉన్నందున కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి నిత్యం కూరగా యల్లో వేసే మిర్చి ఘాటెక్కడం,. టమాట పులుపెక్కింది. అల్లం నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు పెరగడం సామాన్యులకు కొనక ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం టమాట కిలోకు ధర రూ.70, బీరకాయ రూ.100, కాకరకాయ రూ.100, దోసకాయ రూ.100, దొండకాయ రూ.80, గోరుచిక్కుడు రూ. 80, మిర్చి రూ.100, చిక్కుడుకాయ రూ.100, క్యారెట్ రూ.100, క్యాబేజి రూ.100, కొత్తిమీర రూ.200, పుదీన రూ. 120, అలిచెంత రూ.80, బెండకాయ రూ.80 పలుకుతుండటంతో సామాన్యులు కొనలేక ఆందోళన చెందుతున్నారు. వారం, పది రోజుల్లోనే ధరలు ఆకాశానికి చేరుకోవడంతో ప్రజలు ఏం కొనాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మరో నెల రోజుల వరకు ధరలు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు తెలుపుతున్నారు. ధరలు అధికం గా ఉండడంతో వ్యాపారాలు కూడా దెబ్బతిం టున్నాయని వాపోతున్నారు.
- రైతులను ప్రోత్సహిస్తే..
కూరగాయల సాగు చేపట్టే రైతులకు ప్రభుత్వం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు సరపరా చేసి ప్రోత్సహించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. రైతులను ప్రోత్సహిస్తేనే కూరగాయలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పామాయిల్ సాగును ఏ విధంగా ప్రోత్సహిస్తున్నదో అదే తీరులో కూరగాయల సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో నీటి వసతి ఉన్న రైతులే కూరగాయల సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వం జిల్లాలో కూరగాయల సాగు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించినా అది ప్రకటనలకే పరిమితం కావడం గమనార్హం. ప్రభుత్వం కూరగాయల సాగుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టని కారణంగా కూరగా యలకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం అం దించే వివిధ రకాల ప్రోత్సాహకాలు రైతుల దరికి చేరకపోవడంతో సాగుపై అవగాహన కరువైందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఆర్థికంగా భారం..
- రామగిరి శ్రీనివాస్, బెజ్జూరు
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండ డంతో ఆర్థికంగా సమాన్యులకు భారంగా మారింది. ఏ కూరగాయల ధరలు చూసినా కిలో ధర 100కు తక్కువగా లేదు. రూ.500 తీసుకొని మార్కెట్‌కు వెళితే సంచి కూడా నిండడం లేదు. ధరలు విపరీతంగా పెరగడం సామాన్యులకు అవస్థగా మారాయి. మధ్య తరగతి, పేదలు ఇబ్బందులు పడుతున్నారు.