kumaram bheem asifabad- జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
ABN , Publish Date - Jan 24 , 2026 | 10:28 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలతోనే నివారించవచ్చునని ఎస్పీ నితికా పంత్ అన్నారు. స్థానిక ఎస్పీఎంలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కార్మికులకు నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపడం, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం తదితర కారణాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
కాగజ్‌నగర్ టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలతోనే నివారించవచ్చునని ఎస్పీ నితికా పంత్ అన్నారు. స్థానిక ఎస్పీఎంలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కార్మికులకు నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడపడం, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం తదితర కారణాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో గత ఏడాది 1.7 లక్షల మంది మృతి చెందారని వివరించారు. మన రాష్ట్రంలోనే ఎనిమిది వేల మంది మృతి చెందడం బాధాకరమన్నారు. సోషల్ మీడియా రీల్స్ కోసం సాహస కృత్యాలు చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసుల్లో గతంలో కంటే మరింత కఠిన చట్టాలు అమలు అవుతున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యమైన వ్యక్తులు మరణిస్తే వారి కుటుంబీకుల బాధ వర్ణనాతీతమన్నారు. తల్లిదండ్రులు యువకులకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ వావహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని చెప్పారు. ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, ఎస్పీఎం యూనిట్ హెడ్ ఏకే మిశ్రా, ఎస్పీఎం జీఎం గిరి, సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి, ఏఎంవీఐ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ మదూకర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.