Share News

kumaram bheem asifabad-రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:55 PM

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటారు సైకిల్‌ ర్యాలీలో జిల్లా ఎస్పీ నితికా పంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఎస్పీ జెండా ఊపి మోటారు సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని అన్నారు.

kumaram bheem asifabad-రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
బైక్‌ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ, అదనపు ఎస్పీ తదితరులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటారు సైకిల్‌ ర్యాలీలో జిల్లా ఎస్పీ నితికా పంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఎస్పీ జెండా ఊపి మోటారు సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చని అన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు పోలీసు శాఖ ,రెవెన్యూ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అనేక విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రజలందరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ముఖ్యంగా యువత మద్యం తాగి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ ధరించాలన్నారు. అనంతరం ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సబ్‌ జైలు, పోలీసు స్టేషన్‌, కేబీ చౌక్‌ మీదుగా తిరిగి కేబీ చౌక్‌ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ వహిదుద్దీ న్‌, మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజమల్లు, సీఐలు బాలాజీ వరప్రసాద్‌, సత్యనారా యణ, ప్రేంకుమార్‌, ఆర్‌ఐలు అంజన్న, విద్యాసాగర్‌, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

ఆసిఫాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సావిత్రిబాయి ఫూలే జయంతిని పురష్కరించుకొని శనివారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే జిల్లాలో పాఠశాలల ఆభవృద్ధికి కృషి చేసిన పది మంది మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. పావిత్రిబాయి ఫూలే జయంతిని పురష్కరించుకొని కలెక్టరేట్‌లో విద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. స సావిత్రిబాయి ఫూలే ఆశయాలు ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జీ డీఈఓ దీపక్‌ తివారి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, ఆయా సంఘాల నాయకులు మారుతి, ప్రణయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 10:55 PM