Share News

ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కర ఏర్పాట్లు...

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:39 PM

వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరా లను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కర ఏర్పాట్లు...

సుమారు రూ. 158 కోట్ల అంచనా వ్యయంతో పనులు

-ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం

-పుష్కరఘాట్లు, రోడ్ల విస్తరణ, మౌలిక వసతులపై ధృష్టి

-మంచిర్యాలలో రెండో ఘాట్‌ పనులకు శంకుస్థాపన

-రెండు లక్షల పైచిలుకు పుష్కర స్నానాలకు అవకాశం

మంచిర్యాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరా లను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిం చడం ద్వారా పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు వివిధ ప్రభు త్వశాఖల ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. దీంతో ఆయా శాఖల ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటి నుంచే పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2027 జూన్‌ 26 నుంచి అదే ఏడాది జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. పుష్కరా లకు మరో తొమ్మిది నెలల సమయం ఉండగానే పెద్ద మొత్తంలో పనులు చేపట్టవలసి ఉన్నందున ముంద స్తుగానే అధికారులు అందుకు సన్నద్దం అవుతున్నారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో..

గోదావరి పుష్కరాల పనులను వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మునిసిపాలిటీలు, దేవాదాయ, పంచాయతీరాజ్‌, రోడ్లు మరియు భవనా లు, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో అవసరమైన ని ధులను ఇప్పటికే కేటాయించగా, త్వరలో బడ్జెట్‌ కూడా విడుదల కానుంది. మునిసిపాలిటీల ఆధ్వర్యంలో పుష్క రఘాట్ల వద్ద అదనపు బాత్రూంలు, లైటింగ్‌ ఏర్పాట్లు, పారిశుధ్య పనులు, తాగునీటి సౌకర్యం చేపడుతుండగా, ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల నుంచి పుష్కర ఘాట్లకు భక్తులు వెళ్లేందుకు అవసరమైన రోడ్ల నిర్మాణం, కొన్ని చోట్ల రోడ్ల మర మ్మతులు చేపట్టనున్నారు. నీటిపారుదలశాఖ ఆధ్వర్యం లో కొత్త పుష్కరఘాట్ల నిర్మాణం, పాత వాటికి మర మ్మతులు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో శార్థ మండ పాలు, కేశఖండన మండపాలు, అవసరమైన చోట ఆలయాలకు మరమ్మతులు పనులు విడుతల వారీగా చేపట్టనున్నారు. ఆయా పనులు చేపట్టేందుకు జిల్లాకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తంగా రూ. 158 కోట్ల వరకు విడుతల వారీగా నిధులను కేటా యించనున్నారు. అత్యధికంగా దేవాదాయశాఖ తరుపున దాదాపు రూ. 129 కోట్లు కేటాయించగా, విడుతల వా రీగా పనులు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ప్రాథమి కంగా అందిన సమాచారం మేరకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రూ. 12 కోట్లు కేటాయించగా, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ, మునిసిపల్‌ శాఖల ఆధ్వర్యంలో సు మారు రూ. 17 కోట్ల మేర నిధులు కేటాయించనున్నారు.

రోడ్లకు మహర్దశ....

గోదావరి పుష్కరాల పుణ్యమాని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లకు మహర్దశ పట్టనుంది. ద శాబ్దాల కాలంగా రోడ్లకు నోచుకోని ప్రజానీకానికి గోదా వరి పుష్కరాలు అంతర్గత రహదారులను ఏర్పాటు చే యనున్నాయి. చివరిసారిగా 2015లో జరిగిన గోదా వరి పుష్కరాల సమయంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పటిష్టమైన సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్డు నిర్మాణం చేప ట్టారు. స్థానిక రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నుంచి మొదలుకొని గోదావరి నది వరకు రెండు వరుసల సీసీ రోడ్డు ని ర్మాణం చేపట్టగా, రోడ్డు డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు పనులు కూడా చేపట్టడంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ప్రస్తుత పుష్కరాల సంద ర్భంగానూ రహదారులు లేని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా, ప్రజల కష్టాలు తొలగిపోనున్నాయి.

గూడెం ఆలయ నిర్మాణానికి ప్రత్యేక నిధులు....

గోదావరి పుష్క పనుల్లో భాగంగా దండేపల్లి మం డలం గూడెం ఆలయ పున:ర్మిణానికి దేవాదాయశాఖ ప్రత్యేకంగా రూ. 58 కోట్ల నిధులు కేటాయింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక శ్రద్దతో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దీంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోను న్నాయి. అలాగే నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంధ్రంలో రెండో ఘాట్‌ నిర్మాణ పనులు చేప డుతున్నారు. ఇప్పటికే గోదావరి ఒడ్డున పుష్కరఘాట్‌ ఉండగా, భక్తుల తాకిడి మేరకు సౌకర్యాలు అందుబా టులో లేనికారణంగా రెండో ఘాట్‌ నిర్మాణానికి పూ నుకున్నారు. ఆ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు ఇటీవల శంకుస్థాపన చేశారు. అలాగే చె న్నూరు పట్టణంలోని గోదావరి నది వద్ద పుష్కరఘాట్‌ నిర్మాణంతోపాటు వివిధ పనుల నిమిత్తం దేవాదా యశాఖ రూ. 35 కోట్లు కేటాయించగా, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేకానంద కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు.

రెండు లక్షల పైచిలుకు మంది భక్తులు అంచనా....

వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలలో జిల్లాలోని వివిధ ఘాట్ల వద్ద దాదాపు రెండు లక్షలకుపైగా భక్తు లు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా చెన్నూరు, మంచిర్యాల, గూడెం పుష్కర ఘాట్ల వద్ద అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనుం డగా, గోదావరి తీరం వెంట వివిధ ప్రాంతాల్లోనూ భక్తుల తాకిడి ఉండనుంది. గత పుష్కరాల సమయం లో మంచిర్యాలలో 12 లక్షలు, చెన్నూరులో 10 లక్షలు, గూడెం వద్ద 10 లక్షలు, ఇతర చోట్లా మరో పది లక్షల వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెబుతు న్నారు. ప్రస్తుతం రవాణా సౌకర్యం మెరుగుపడటం, ఏర్పాట్లు కూడా ఘనంగా చేపడుతున్నందున వచ్చే ఏడాది అంతకు నాలుగు రెట్ల మంది భక్తులు అధికంగా తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 15 , 2026 | 11:39 PM