Share News

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛే ప్రాణాధారం

ABN , Publish Date - May 03 , 2026 | 04:43 AM

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ప్రాణాధారమని, సమాజంలోని సత్యాన్ని వెలికితీయడంలో మీడియా పాత్ర కీలకమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛే ప్రాణాధారం

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ప్రాణాధారమని, సమాజంలోని సత్యాన్ని వెలికితీయడంలో మీడియా పాత్ర కీలకమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. జర్నలిస్టులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పనితీరును సమీక్షిస్తూ, ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో మీడియా మరింత బలోపేతం కావాలన్నారు. మీడియా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - May 03 , 2026 | 04:43 AM