Share News

kumaram bheem asifabad- రెండో విడత జనగణనకు సన్నద్ధం

ABN , Publish Date - Nov 06 , 2026 | 10:21 PM

జనగణన రెండో విడతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవు తోంది. ఇప్పటికే ఇళ్ల గణన(హౌస్‌ లిప్టింగ్‌ ఆపరే షన్‌) విజయవంతంగా పూర్తయింది. 2027ఫిబ్రవరి లో ప్రారంభం కానున్న జనగణనకు ముందస్తు ప్రణాళిక రూపకల్పన ప్రారంభమైంది.

kumaram bheem asifabad- రెండో విడత జనగణనకు సన్నద్ధం
లోగో

- ఒక్కో మండలాన్ని ఒక్కో చార్జ్‌గా విభజన

- చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ప్రారంభం

బెజ్జూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జనగణన రెండో విడతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవు తోంది. ఇప్పటికే ఇళ్ల గణన(హౌస్‌ లిప్టింగ్‌ ఆపరే షన్‌) విజయవంతంగా పూర్తయింది. 2027ఫిబ్రవరి లో ప్రారంభం కానున్న జనగణనకు ముందస్తు ప్రణాళిక రూపకల్పన ప్రారంభమైంది. ఇటీవల చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మొదటి విడత హౌస్‌ లిప్టింగ్‌ మాదిరిగానే జన గణన కోసం ప్రతీ 800మంది జనా భాకు ఒక ఎన్యూమరేషన్‌ బ్లాకుగా గుర్తించనున్నా రు. ఇళ్ల గణన చేసినప్పుడు వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ బ్లాకులు గుర్తించారు.

- పని ఒత్తిడి లేకుండా..

జనగణన చేసే ఎన్యూమరేటర్లకు పని ఒత్తిడి లేకుండా 750నుంచి 800మంది జనాభాను బ్లాక్‌గా గుర్తించనున్నారు. ఈ బాధ్యతలను చార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు అప్పగించి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐలు, డీటీలు, సీనియర్‌ అసిస్టెంట్లు ఈ చార్జ్‌ క్లర్కులుగా వ్యవహ రించనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీస ర్లు, ఈ స్థాయి అధికారులు పని చేస్తారు. వీరికి టెక్నికల్‌ అసిస్టెంట్ల సహాయంతో ప్రత్యేక సాప్ట్‌వేర్‌ రూపొందించి బ్లాకును గుర్తిస్తున్నారు.

- పొరపాట్లు లేకుండా..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు గాను పక్కాగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలతో అధికారులను కీలకం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఈ జనగణన ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు సెన్సెస్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు 34మం దికి, జిల్లా సెన్సెస్‌ అధికారులు 9, సబ్‌ డివిజన్‌ అధికారులు 2, చార్జ్‌ అధికారులు 17, అదనపు చార్జ్‌ అధికారులు 17మందికి శిక్షణ పూర్తి చేశారు. ఇంకా మాస్టర్‌ ట్రైనర్‌-1, ఫీల్డ్‌ ట్రైనర్లు-20మంది, ఎన్యూ మరేటర్లు-1012, సూపర్‌వైజర్లు-174మందికి త్వరలో శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

- ప్రత్యేక కార్యాచరణ..

రెండో విడత జనగణనకు అధికార యంత్రాంగం జనవరిలో గణన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎన్యూమరేటర్లను క్షేత్రస్థాయిలో బ్లాక్‌ల వారీగా ఇళ్లకు తిరిగి సర్వే చేయనున్నారు. గణనలో భాగంగా 40రకాల ప్రశ్నలను అడిగి వివరాలు యా ప్‌లో నమోదు చేస్తారు. ఇంట్లోని కుటుంబ సభ్యుల వివరాలు, విద్యార్హత, జెండర్‌, వయసు, వివాహ స్థి తి, జాతీయత, మతం, ఆధార్‌, ఓటర్‌ఐడీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు అడిగి నమోదు చేస్తారు.

Updated Date - Nov 06 , 2026 | 10:21 PM