Share News

kumaram bheem asifabad- సైన్స్‌ ఫెయిర్‌కు సిద్ధం

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:40 PM

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విదానానికి పదును పెట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. విద్యార్థులను ప్రయోగాలు, నూతన అవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ అవార్డులు పొందిన ఎగ్జిబిట్‌ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

kumaram bheem asifabad- సైన్స్‌ ఫెయిర్‌కు సిద్ధం
లోగో

- సన్నాహలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విదానానికి పదును పెట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. విద్యార్థులను ప్రయోగాలు, నూతన అవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ అవార్డులు పొందిన ఎగ్జిబిట్‌ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు, ఎగ్జిబిట్‌లు రూపొందించేలా హెచ్‌ఎంలు, గైడ్‌ టీచర్లు ప్రోత్సహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ విద్యా సంవత్సరానికి సంబందించి జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఐదు అంశాలపై ఎగ్జిబిట్స్‌ ప్రదర్శించనున్నారు. జిల్లాస్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక్‌ ప్రదర్శన, తెలంగాణ ఫ్యూచర్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌, జిల్లాస్థాయి ఎగ్జిబిషన్‌ అండ్‌ ప్రాజెక్టు ఇన్‌స్సైర్‌ అవార్డ్స్‌ మనాక్‌, సోషల్‌సైన్స్‌ ప్రదర్శన, పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లను నిర్వహించనున్నారు.

ఇన్‌స్పైర్‌కు 105 ప్రాజెక్టులు.

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రదర్శనకు జిల్లాలో 105 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. అయా ప్రాజెక్టులను జిల్లాస్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులు సైతం వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నారు. గతేడాది నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో 118 ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో రాష్ట్రస్థాయికి 12 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో పాల్గొన్న వాటిలో ఒక ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికైంది.

ఒకే వేదికపై..

-సచ్చిదానందచారి, డీఈవో

జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రదర్శనకు ఒకే వేదికపై నిర్వహిం చాలని సీఈఆర్‌టీ సూచించింది. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంగణాన్ని గుర్తించాం. ఈ ప్రదర్శనల కోసం హెచ్‌ఎంలు విద్యార్థులను సిద్ధం చేయాలి. మూడు రోజుల పాటు జిల్లాస్థాయి ప్రదర్శనలు నిర్వహించి ఉత్తమమైన వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాం. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Nov 25 , 2026 | 10:40 PM