Share News

జన గణనకు సన్నద్ధం

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:23 PM

జన గణనకు సర్వం సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియమకం పూర్తయింది. ప్రతి పదే ళ్లకు ఒక్కసారి జరిగే జనగణన ఆలస్యంగా ఈ యే డాది ప్రారంభమవుతుంది.

 జన గణనకు సన్నద్ధం
Preparing for the census

- మే 11న ఇళ్ల గణన ప్రారంభం

- మొదట ఇళ్లు, తర్వాత జన గణన

- ఈసారి డిజిటల్‌ విధానంలో సర్వే

వాంకిడి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జన గణనకు సర్వం సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియమకం పూర్తయింది. ప్రతి పదే ళ్లకు ఒక్కసారి జరిగే జనగణన ఆలస్యంగా ఈ యే డాది ప్రారంభమవుతుంది. జన గణనను రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో ఇళ్ల గణన, రెండో దశలో జనాభా లెక్కలు చేస్తారు. జన గణన - 2027లో భాగంగా మొదటి దశ ఇళ్ల గణనను చేపట్టనున్నారు. ఇందులోమొదటిసారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టారు. కుటుం బంలోని ఏ వ్యక్తి అయినా ఎక్కడినుంచైనా పోర్టల్‌లో వివరాలు నమో దు చేయవచ్చు. అధునిక సమగ్ర డేటా సేకరణకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అధికారులు ఐడీని జనరేట్‌ చేసి ఎన్‌ఎంఎఫ్‌ ఈ-మెయిల్‌ ద్వారా అందిస్తే ఎన్యుమరేటర్‌తో పరిశీలిస్తారు.

ఇప్పటికే నియామయం పూర్తి

జన గణనతో కీలకమైన బ్లాక్‌లు, ఎన్యూమరేటర్స్‌, సూపర్‌వైజర్స్‌ నియమాక ప్రక్రి యను అధికారులు పూర్తి చేశారు. జిల్లా స్థాయిలో టెక్నికట్‌ అసిస్టెంట్‌ను నియమించారు. మున్సిపల్‌ స్థాయిలో కమిషనర్‌, మండల స్థాయిలో సెన్సెస్‌ చార్ట్‌అధికారులు ఉంటారు. 750 నుంచి 800 మంది జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను ఆరుగురు ఎన్యుమరేటర్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. ఒక ఎన్యుమరేటర్‌ ఏరియాను ఒక బ్లాక్‌గా విభ జించారు. వార్డుల వారీగా మ్యాప్‌లను సిద్ధం చేశారు. వాటి ఆధారంగా ఎన్యుమరేటర్‌ బ్లాక్‌లను విభజించారు. హెచ్‌ఎల్‌వో యాప్‌ ద్వారా ఓ మ్యాప్‌ను ఎన్యుమరేటర్‌ భవ నాలు, రోడ్లు విధులను చూపుతూ పటాన్ని గీస్తారు. ఏ ఒక్క ఇంటిని వదలకుండా ఇళ్ల జాబితా డేటాను నమోదు చేస్తారు. హెచ్‌ఎల్‌వోల మధ్య ఖాళీలు లేదా ఒకదానిపై ఒకటి ఓవర్‌ గ్యాప్‌ లేకుండా సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తారు. జన గణన చట్టం - 1948 ప్రకారం సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యమైందని ఆర్టీఐ చట్టం - 2005 ప్రకారం బహిర్గ తం చేయబడదని అధికారులు చెబుతున్నారు.

రెండో దశలో ఇళ్లు లేని వారి లెక్కలు

బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పక్కన నివసించే కుటుంబాలు, ఖాళీ స్థలంలో, ఫుట్‌ పాత్‌లపై ఉన్న ఫ్లైఓవర్స్‌ కింద, ప్రార్థన స్థలాలు, మండపాలు, రైల్వే ప్లాట్‌ ఫామ్‌లు వంటి ప్రదేశాలలో నివసించే వారిని రెండో దశలో లెక్కించనున్నారు. ఇళ్ల జాబితా ప్రకా రం బ్టాక్‌లోని ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు నంబ ర్లను కేటాయిస్తారు. డిజిటల్‌ పద్ధతిన ఈ నంబర్లు వేస్తారు. వరుసక్రమంలో కేటాయింపు ఉంటుంది. పంప్‌హౌస్‌లు, దేవాలయాలు, జ్ఞాన మందిరాలు, పొలాల్లో కట్టిన గుడిసెలకూ నంబర్లు కేటాయిస్తారు. కాగా ఇళ్ల గణనలో ఎన్యుమరేటర్లు ఇంటికి నంబర్లు ఇవ్వడంతో పాటు 34 రకాల వివరణలను మొబైల్‌ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఇందులో ఇంటి స్థితి, దంప తుల వివరాలు, తాగునీరు, మరుగుదొడ్డి, మురుగునీటి పారుదల, ఎల్పీజీ కనెక్షన్‌, వంటగది, రెడియో, టెలివిజన్‌, ఇంటర్నేట్‌ సదుపాయలు, ల్యాప్‌ల్యాప్‌, కంప్యూటర్‌ మొబైల్‌ ఫోన్‌, స్మార్ట్‌ ఫోన్‌, ద్విచక్రవాహనం, నాలుగుచక్రాల వాహన వివరాలు, ప్రఽధాన ఆహార ధాన్యం, సామాజిక వర్గం, నివాస గదుల సంఖ్య వంటి వివరాలు నమోదు చేస్తారు.

Updated Date - Apr 21 , 2026 | 07:43 AM