Share News

సేంద్రియ సాగుకు సన్నద్ధం..

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:30 PM

సహజ సేధ్యా న్ని ప్రోత్సహిస్తూ రసాయన బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో 15 క్లస్టర్ల లో 1875 మంది రైతులను ఎంపిక చేసి వారికి నిపు ణులతో శిక్షణనిచ్చారు.

సేంద్రియ సాగుకు సన్నద్ధం..
సేంద్రీయ ఎరువుగా పొలంలో పశువుల పేడ వేసుకుంటున్న రైతు

-ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం

-సేంద్రియ పంటలపై రైతులకు సమగ్ర శిక్షణ

-జిల్లాలో 15 క్లస్టర్లు..1875 మంది రైతుల ఎంపిక

-వానాకాలం సీజన్‌ నుంచి సాగుకు శ్రీకారం

నెన్నెల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : సహజ సేధ్యా న్ని ప్రోత్సహిస్తూ రసాయన బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో 15 క్లస్టర్ల లో 1875 మంది రైతులను ఎంపిక చేసి వారికి నిపు ణులతో శిక్షణనిచ్చారు. ఐడీ కార్డులు, క్యాలెండరు, క్యా పు, సాగు విధానం తెలిపే పుస్తకంతో కూడిన కిట్లను ఉచితంగా అందజేశారు. ప్రోత్సాహకంగా సీజన్‌ కు రూ. 2 వేల చొప్పున మొత్తంగా రూ. 4 వేలు రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. సాగుతో పాటు మార్కె టింగ్‌పై అవగాహన కోసం ప్రతీ క్లస్టర్‌కు ఇద్దరేసి కృషి సఖీలను నియమించారు. ప్రకృతి వ్యవసాయానికి అవ సరమైన బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీ వ ఉత్పాదకాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆ లోచనలో ప్రభుత్వం ఉంది. రాబోయే వానాకాలం సీజ న్‌ నుంచి ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను అధి కారులు సన్నద్ధం చేస్తున్నారు.

నేల ఆరోగ్యం మెరుగు పరుస్తూ...

పంటల దిగుబడి అనేది ప్రధానంగా నేలసారం, సాగుచేసే రకం, యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. దీంట్లో కీలక భూమిక పోషించేది మట్టిలోని పోషక విలువలు. నేలలో సహజ సిద్ధంగా అనేక పోష కాలు ఉంటాయి. వీటి స్థితి గతులను అంచనా వేయకుండా పదేపదే రసాయన ఎరువులను విచ్చలవి డిగా వాడటం వల్ల సాగుఖర్చు పెరిగిపోవడమే కాకుం డా భూమి నిస్సారంగా మారుతుంది. రైతులు, నత్ర జని, భాస్వరం, పొటాష్‌ లాంటి ప్రధాన పోషకాలను మాత్రమే వాడుతున్నారు. మిగతా పోషకాలను నిర్ల క్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన రైతుల పొలాల నుంచి భూసార పరీక్షల కోసం మట్టి నమూ నాలు సేకరించారు. వాటిని పరీక్షలు చేసి భూ ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆ భూముల్లో కావాల్సిన పోషకా లను సేంద్రీయ పద్ధతిలో అందించడంతో నేల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు నాన్యమైన పంటలు పండిం చేలా అధికారులు రైతులకు తర్ఫీదునిస్తున్నారు.

- జీవవైవిద్యాన్ని కాపాడుకునేలా..

నేలలో సహజంగా అనంతమైన జీవవైవిద్యం ఉం టుంది. ఒక అంచనా ప్రకారం పిడికెడు ఆరోగ్యమైన మట్టిలో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంద్రాలు, వేల సంఖ్యలో కీటకాలు, పదుల సంఖ్యలో వానపాములు, నులి పురుగులు ఉండి జీవ వైవిద్యాన్ని కొనసాగిస్తా యి. నేలలోని కొన్ని సూక్ష్మజీవులు పంట మొక్కలకు గాలిలోని నత్రజనిని స్వీకరించి అందజేస్తాయి. మరికొ న్ని నేలలోని ఖనిజలవణాలను, కరిగించి మొక్కలకు అందజేస్తాయి. ఇంకొన్ని నేలలోని సేంద్రీయ పదార్థా లను కుళ్లిపోయేలా చేసి పోషకాలను అందజేస్తాయి. మిగతావి నేలలోని భౌతిక స్థితిని మెరుగు పరిచి, నేల లోని గాలి, నీరు ప్రసరణను పునరుద్ధరిస్తాయి. కొన్ని రకాల శిలీంద్రాలు పంట మొక్కల వేళ్లతో అనుసంధా నించబడి నీటిని పోషకాలను అందిస్తూ పంటలను బెట్టనుంచి కాపాడతాయి. ఇన్ని ఉపయోగాలున్న నేల లోని జీవవైవిద్యాన్ని కాపాడుకుంటూ.. పంటలకు ఉప యోగ పడే మిత్రపురుగులు, కీటకాలను కాపాడుకు నేలా సహజ సేద్యం ఉంటుంది.

-భూ భౌతికస్థితి దెబ్బతినకుండా..

పదేపదే రసాయణ ఎరువులపైన ఆధారపడితే భూ భౌతికస్థితి దెబ్బతిని మేలు కంటే కీడే ఎక్కువ జరుగు తుంది. రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైన ఉంది. పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట, పచ్చిఆకురొట్ట పైర్లు, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కుళ్లిన సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు విరివిగా వాడాలి. సహజవనరుల ద్వారా భూసారాన్ని పెంపొం దించాలి. జీవనియంత్రణ పద్ధతులకు, వృక్షసంబం దమైన కషాయాలకు ప్రాధాన్యమివ్వాలి. గోమూత్రం, గోమలం, ఆకులతో కషాయాలు తయారు చేసి పంట లపైన ఉపయోగించి నాణ్యమైన దిగుబడులు, మంచి ధరలు పొందవచ్చు. బిజామృతంతో విత్తనశుద్ది, జీవా మృతంతో పురుగుల అదుపు చేసి ఆశించిన దిగుబడు లు సాధించవచ్చు.

ప్రకృతి సేద్యం అలవాటు చేయడమే లక్ష్యం

-సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి

రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని వీడి సేంద్రీయ పద్ధతిలో పంటల సాగుకు చేసేలా రై తులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కింద ఎంపికైన రైతులకు శిక్షణ కూడా ఇ చ్చాం. సాగుకు ఉపయుక్తమైన కిట్లు అందజేశాం. ప్రొ త్సాహకంగా నగదు కూడా అందజేస్తాం. ఈ పాటికే భూసార పరీక్షలు చేసి రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డు లు అందజేశాం. వాటి ఆధారంగా నేలలో రసాయనాల స్థాయిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడే పోషకా ల గూర్చి వివరిస్తాం. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను సన్నద్ధం చే స్తున్నాం. రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని అల వాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

Updated Date - Mar 23 , 2026 | 11:30 PM