Share News

పత్తి కొనుగోళ్లకు సమాయత్తం...

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:38 PM

వానా కాలం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభు త్వం సమాయత్తం అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి కొనుగోళ్లు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

పత్తి కొనుగోళ్లకు సమాయత్తం...

-జిల్లాలో 5 సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు

-దసరా తరువాత కొనుగోళ్లు..

-ఎల్‌నినో ప్రభావంతో తగ్గనున్న దిగుబడి

-మద్దతు ధరపైనా రైతుల అసంతృప్తి

మంచిర్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వానా కాలం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభు త్వం సమాయత్తం అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి కొనుగోళ్లు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సీసీఐ ద్వారా జిల్లాలో ఈ సీజన్‌లో మొ త్తం 5 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు స మాయత్తం అవుతున్నారు. బెల్లంపల్లి, చెన్నూరు, జై పూర్‌ మండలం ఇందారం, లక్షెట్టిపేట, కన్నెపల్లి మం డలాల్లో ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయనుండగా, పంట నిల్వ చేసేందుకు ఆ యా కేంధ్రాల పరిధిలో మొత్తం 12 జిన్నింగ్‌ మిల్లు లు అందుబాటులో ఉన్నాయి. నవంబరులో పత్తి పం ట ఏరే సమయం కావడంతో కాస్త ముందస్తుగానే కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చే స్తున్నారు. గత ఏడాది మాదిరిగానే కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారానే రైతులు పత్తిని అమ్ముకొనేందుకు ఏ ర్పాట్లు చేస్తుండగా, ఈ నెల 22 నుంచి స్లాట్లు అందు బాటగులోకి వస్తాయని మార్కెటింగ్‌ శాఖ అఽధికా రులు చెబుతున్నారు.

వానాకాలం సాగు దిగుబడి అంచనా ఇలా...

జిల్లా వ్యాప్తంగా వానాకాలం పత్తి సీజన్‌కు సం బంధించి లక్షా 74 వేల ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేశారు. ఎకరాకు సగటున 9.6 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, మొత్తంగా 16 లక్షల క్వింటాళ్ల పత్తి రైతుల చేతికి వస్తుందని భావిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభా వ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దిగుబడి తగ్గే అవ కాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మండలాల వారీగా పత్తి సాగు, దిగుబడి అంచనా ఇలా ఉంది.....

మండలం సాగువిస్తీర్ణం (ఎకరాల్లో) దిగుబడి(క్వింటాళ్లలో)

బెల్లంపల్లి 7725 77250

కాసిపేట 12580 125800

తాండూరు 15481 154810

భీమిని 23369 210321

కన్నెపల్లి 18655 186550

నెన్నెల 10981 109810

వేమనపల్లి 9777 102659

కోటపల్లి 21734 228207

చెన్నూరు 14020 140200

జైపూరు 5864 58640

భీమారం 4185 41850

మందమర్రి 7819 70371

మంచిర్యాల 621 4968

నస్పూర్‌ 57 456

హాజీపూర్‌ 6162 61620

లక్షెట్టిపేట 5650 56500

దండేపల్లి 3868 34812

జన్నారం 3593 32337

పెరిగిన సాగు ఖర్చులు....

వ్యవసాయ రంగంలో పంట సాగు విస్తీర్ణం కోసం రైతులు అధిక ఖర్చులు భరించాల్సి వస్తోంది. భూమి దున్నింది మొదలు పత్తి పంట చేతికి వచ్చే దాకా ఎకరాకు సగటున రూ. 40వేల వరకు ఖర్చు చేయా ల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా అన్ని ఖర్చులు పోను రూ. 20వేల చొప్పున మిగిలుతుందని చెబుతు న్నారు. అయితే ఏ యేడు వర్షాభావ పరిస్థితులతో సకాలంలో నీరందక దిగుబడిపై ప్రభావం చూపు తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎకరాకు గరిష్టంగా 4 క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, సాగు ఖర్చులు కూడా గిట్టుబాటు కావని చెబుతున్నారు.

మద్దతు ధరపై అసంతృప్తి....

ఆరుగాలం కాయ కష్టం చేసి, పండించిన పంటలకు కనీస మద్దతు ధర రావడం లేదని గత కొంతకా లంగా రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం కూ డా కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పత్తి పం ట మద్దతు ధరలు కూడా కంటి తుడుపు చర్యగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ యేడు కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 8 శా తం తేమతో పత్తికి క్వింటాలుకు పొడుగు పింజ రకా నికి రూ .8667 ఉండగా, పొట్టి పింజకు రూ. 8267 మద్దతు ధర లభించనుంది. గత ఏడాది క్వింటాలు పత్తి మద్దతు ధర రూ. 8400 ఉండగా, ఈ సంవత్స రం స్వల్పంగా పెరిగింది. అయితే ప్రభుత్వం నిర్ణ యించిన ధరకు సీసీఐలో విక్రయాలు జరిపితే కష్టమే మిగులుతుందని, ప్రైవేటు ఆశ్రయించడమే మేలన్న ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు మార్కెట్లో ధర రూ. 9200 నుంచి రూ. 9500 వరకు లభించే అవకాశాలు ఉండటంతో అటువైపే రైతులు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉం డటంతో గిట్టుబాటు ధర కోసం రైతులు వేచి ఉండే అవకాశాలు ఉన్నాయి.

మద్దతు ధర మరింతగా పెంచాల్సింది...

లగిసెట్టి రాజమౌళి, రైతు గుడిపేట

కేంధ్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మ రింతగా పెంచితే రైతులకు మేలు జరిగి ఉండేది. అ నావృష్టి కారణంగా ఆశించిన మేర పత్తి దిగుబడి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేస్తే సాధారణంగా 50 క్వింటాళ్ల పంట చేతికి రావాలి. కానీ ఈ యేడు పరిస్థితులు అనుకూలించక సగటున ఎకరాకు 4 క్వింటాళ్ల మేర మాత్రమే దిగు బడి వస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్విం టాకు రూ. 8667తో విక్రయిస్తే సాగు ఖర్చులు కూడా చేతికి రావు. పత్తికి కనీసం రూ. 10వేలు మద్దతు ధర చెల్లిస్తే పెట్టుబడి ఖర్చులు గిట్టుబాటవుతాయి.

Updated Date - Oct 17 , 2026 | 11:38 PM