kumaram bheem asifabad- పత్తి కొనుగోలుకు సన్నద్ధత
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:11 PM
జిల్లాలో 2026-27 సీజన్ పత్తి కొనుగోళ్లకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. జిల్లాలో ఈ సారి అదిక విస్తీర్ణంలో తెల్ల బంగారం సాగు కాగా ఇప్పుడిప్పుడే దిగుబడులు చేతికందుతున్నాయి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తికొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్దం అయ్యారు. నవంబరు మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
- నవంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఆసిఫాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2026-27 సీజన్ పత్తి కొనుగోళ్లకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. జిల్లాలో ఈ సారి అదిక విస్తీర్ణంలో తెల్ల బంగారం సాగు కాగా ఇప్పుడిప్పుడే దిగుబడులు చేతికందుతున్నాయి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తికొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్దం అయ్యారు. నవంబరు మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. పత్తి సేకరణ కోసం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సన్నహలు చేస్తున్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్‌లు వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, ఫైర్, ఆర్టీఏ, తునికలు, కొలతల శాఖల అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లుల యాజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కొనుగోళ్లను పకడ్బందిగా నిర్వహించాలని అదేశించారు. రైతు లకు ఇబ్బందులు తలెత్తకుండ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవాలని సూచించారు. జిన్నింగ్ మిల్లులలో ఎలక్ర్టానిక్ కంటాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు వే బిల్లులతో పాటు అందుకు సంబందించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేసుకొవాలని ఆదేశించారు.
- మూడు మార్కెట్ కమిటీల పరిధిలో..
జిల్లాలోని ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీల పరిధిలలో 24 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి.అయా జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,667 మద్దతు ధర ప్రకటించింది. జిన్నింగ్ మిల్లులలోనే కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడంతో ఏటా సీసీఐ సైతం జిన్నింగ్ మిల్లులలోనే పత్తి కొనుగోళ్లను చేపడుతుంది. ప్రైవేటులో కొనుగోళ్లు ప్రారంభమైతే వ్యాపారుల్లో పోటి పెరిగి రైతులకు మద్దతు ధర లబించే ఆవకాశం ఉంది. ప్రభుత్వ మద్దతు ధర తక్కువగా ఉండటంతో ఈ ఏడాది రైతులు ప్రైవేటు మార్కెట్‌లోనే పత్తిని విక్రయించేందుకు మొగ్గు చూపు తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాలుకు రూ. 9,200 నుంచి 9,500 వరకు ధర పలుకుతున్నది.
- 3.77 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో ఈ ఏడాది 4.6 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు సాగు చేయగా వీటిలో 3.77 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది ప్రైవేటు మార్కెట్‌లో కంటే సీసీఐ మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతులు సీసీఐకే పత్తిని విక్రయించారు. ఈ ఏడాది ప్రభుత్వ మద్దతు ధర రూ. 8,667 ఉండడం బహిరంగ మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర ఆధికంగా ఉండటంతో ప్రైవేటులోనే విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.. జిల్లాలోఈ ఏడాది 26.44 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చేబుతున్నారు.
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం..
- కె హరిత, ఆసిఫాబాద్ కలెక్టర్
జిల్లాలో 2026-27 సీజన్ పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో 3.77లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు.జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు కొరకు ఏర్పాట్లు చేయాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించాం. జిల్లాలోఈ ఏడాది 26.44 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం.