Share News

kumaram bheem asifabad- ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

ABN , Publish Date - Sep 30 , 2026 | 10:46 PM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 47 వేల ఎకరాలలో వరి పంట సాగు చేయగా 23,900 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశిచుకున్నారు. త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్రాల ప్రారంబానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్‌ హరిత, .అదనపు కలెక్టర్‌ డేవిడ్‌లు పలుమార్లు సంబందిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.

kumaram bheem asifabad-  ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
లోగో

- 23,900 మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం

- టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమ యంత్రాలు సమకూర్చనున్న యంత్రాంగం

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు, 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 47 వేల ఎకరాలలో వరి పంట సాగు చేయగా 23,900 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశిచుకున్నారు. త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్రాల ప్రారంబానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్‌ హరిత, .అదనపు కలెక్టర్‌ డేవిడ్‌లు పలుమార్లు సంబందిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాలలో ఈనెలాఖ రులో వరికోతలు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యంలో 21, ఐకేపీ ఆధ్వర్యంలో 19 కేంద్రాలను ప్రారంబిస్తారు. మొదటిరకం ధాన్యానికి రూ.2,461, రెండో రకం ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 నగదు బోనస్‌ గా అందించనున్నారు.

- వానాకాలం సీజన్‌కు..

జిల్లాలో వానాకాలం సీజన్‌ వరి ధాన్యం కొనుగో ళ్లకు అధికారులు 40 కేంద్రాలను ఏర్పాటు చేయను న్నారు. ఇందులో 21 సహకార సంఘాల, 19 ఐకేపీల ఆధ్వర్యంలో నిర్వహించనుర్నారు. రైతులు ధాన్యాన్ని అరబెట్టుకుని తేమ శాతం నిబందనలకు లోబడి ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేలా వ్యవసాయశాఖ అధికా రులు రైతులకు అవగహన కల్పించనున్నారు. కొను గోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశంలో ఏర్పాటు చేసి దోడ్డు రకం, సన్న రకం ధాన్యాం వేర్వేరుగా సేకరించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నా రు.ఽ ధాన్యం సేకరణకు సరిపడా గన్ని బ్యాగులను అందుబాటు ఉంచనున్నారు. టార్పాలిన్‌ కవర్లు, గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు, డ్రయ్యర్లు, తేమ యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ తూకం యంత్రాలు, ట్యాబ్‌ల ను అందుబాటులో ఉంచి రైతుల వద్ద నుం చి క్రమ పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఇబ్బందులు తలేత్తకుండా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

- కనీస వసతులు..

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యం కోసం టెంట్లు, పస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటు ఉంచనున్నారు. 17శాతం లోపు తేమ ఉండేలా తాలు, దుమ్ము లేకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా రైతు లకు అవగాహన కల్పించనున్నారు. క్రమ పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు తరలించేందుకు అవసరమైన గోదాంలను సిద్ధం చేస్తున్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా కొనుగో లు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో ఎంట్రీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తూకం వేసిన ధాన్నాన్ని కేటా యించిన ప్రకారం ట్యాగింగ్‌ చేయబడిన రైస్‌ మిల్లులకు తరలిస్తారు. ఈ మేరకు అవసరాలకు అనుగుణంగా లారీలు , హమాలీలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు..

- కె హరిత, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. తూకం యంత్రాలు, తేమ కొలిచే మీటర్లు, టార్పాలిన్‌ కవర్లు, గన్ని బస్తాలు అందు బాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచిం చాం. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 30 , 2026 | 10:46 PM