Share News

kumaram bheem asifabad-వనమహోత్సవానికి సన్నద్ధం

ABN , Publish Date - May 03 , 2026 | 10:38 PM

గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడమే లక్ష్యం గా ప్రభుత్వం ఏటా వన మహోత్సవ కార్యక్ర మాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కుమరం భీం జిల్లాలో మన మహోత్సవానికి సంబంధించిన లక్ష్యాలను అధికారులు ఖరారు చేశారు.

kumaram bheem asifabad-వనమహోత్సవానికి సన్నద్ధం
లోగో

- పకడ్బందీగా చేపట్టేందుకు అధికారుల కార్యాచరణ

- వర్షాకాలానికి సిద్దం చేసేలా ప్రత్యేక చర్యలు

- జిల్లాలో 20.66 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడమే లక్ష్యం గా ప్రభుత్వం ఏటా వన మహోత్సవ కార్యక్ర మాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కుమరం భీం జిల్లాలో మన మహోత్సవానికి సంబంధించిన లక్ష్యాలను అధికారులు ఖరారు చేశారు. 2026-27 సంవత్సరానికి సంబంఽధించి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 20.66 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు మండలాల వారీగా లక్ష్యాన్ని కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీ ల్లో మొక్కలు సిద్ధం చేశారు. వానలు కురవ డమే అలస్యం.. మొక్కలు నాటేందుకు అధికా రులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదా రులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యల యాలు, ప్రైవేట్‌ సంస్థలు, పరి శ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, వైద్య శాలలు, కళాశాలలు, పాఠశాలల ఆవర ణలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలకు, రైతులు అడిగిన మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సరీల్లో పాలిథిన్‌ సంచుల్లో మట్టి నింపి విత్తనాలు నాటడం, మొలకెత్తిన మొక్కలకు నీరు అందించడం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను విస్తృతంగా పెంచుతున్నారు. వర్షా లు ప్రారంభం కాగానే మొక్కలు నాటేలా అధికారులు కార్యాచరణ పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. నాటిన మొక్కను సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాఽధి హామీ పథకంతో అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఏటా కృషి చేస్తున్నారు.

- మొక్కలు నాటడం వల్ల..

మొక్కలు నాటడం వల్ల గాలి కాలుష్యం తగ్గి, స్వచ్చమైనాన ఆక్సిజన్‌ లభించే అవకా శం ఉంది. దీంతో పాటు వాతావరణ సమతుల్యత కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యి. ప్రధానంగా చెట్లు పెరిగేతే వర్షపాతం మెరుగుకానుంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ అధికారులు గ్రామాల్లో అవగాహన పరుస్తున్నారు. వన మహోత్సవంలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో చైతన్య యాత్రల ద్వారా అవగాహన పరిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జీవవైద్యానికి ఎంతగానో ఉపకరించే ఈ కార్యక్రమానికి పక్షులకు, జంతువులకు కూడా నివాస స్థలాలు చక్కగా ఏర్పడనున్నాయి. వన మహోత్సవం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆర్థిక, సామాజక లాభాలు కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మామిడి, జామ, నేరేడు, ఉసిరి, సీతాఫలాం, వేప, మర్రి, బూరుగు వేప తదితర వాటిని పెంచుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉం ది. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నీ ప్రభుత్వ కార్యాలయా ల్లో అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - May 03 , 2026 | 10:38 PM