kumaram bheem asifabad- వనమహోత్సవానికి సన్నద్ధం
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:55 PM
పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. పదో విడత ఈ ఏడాది వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీల ఏర్పాటులో వేగంగా సన్నద్ధమ వుతోంది. జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు పెంచ డానికి సంబంఽధిత అధికారులు సమాయత్తం చేశా రు.
- నర్సరీలో కొనసాగుతున్న పనులు
- పర్యవేక్షిస్తున్న అధికారులు
పెంచికలపేట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. పదో విడత ఈ ఏడాది వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీల ఏర్పాటులో వేగంగా సన్నద్ధమ వుతోంది. జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు పెంచ డానికి సంబంఽధిత అధికారులు సమాయత్తం చేశా రు. ఇందులో భాగంగా ప్రతీ నర్సరీలో రకరకాల మొక్కలను పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే నర్సరీలో పాలిథిన్ కవర్లలో మట్టిని వేసి విత్తనాలు నింపుతున్నారు. పనులు ముమ్మరంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- జిలా వ్యాప్తంగా..
జిల్లాలోని 15 మండలాలు ఉండగా 335 గ్రామ పంచాయతీల్లో 32.65 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించి ఈ మేరకు ప్రతి గ్రామ పంచా యతీలో నర్సరీ పెంచే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నర్సరీ పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. నర్సరీలో సంచుల్లో మట్టి వేసి నింపుతున్నారు. కొన్ని చోట్ల రోడ్డకు ఇరువైపులా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటి ఆవ రణలో మొక్కలు పెంచుతు న్నారు. చింత, జామ, ఉసిరి, దానిమ్మ, వేప, గూల్‌మోహర్, మద్దిరావ, వెదురు, మామిడి, నిమ్మ, కానుగ, ఈత తదితర మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా విత్తనాలను విత్తుతున్నారు. గత నవంబరు నెలలోనే ప్రారంభించాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. ప్రస్తుతం నర్సరీలలో ఆ యా పనులను ముమ్మరం చేశారు. ఈ మొక్కలను పల్లె ప్రకృతి వనాలతో పాటు ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలకు, ఇంటింటా నాటేందుకు సిద్దం చేస్తున్నారు.
నిర్వహణలో నిర్లక్ష్యం..
జిల్లాలో గత ఏడాది 40.53 లక్షల మొక్కలను పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి స్థాయి లో మొక్కలు నాటక పోవడంతో కొన్ని చోట్ల కొన్ని మొక్కలు నర్సరీలో దర్శనమిస్తు న్నాయి. అధికారులు అడుగుతే మొక్కలు పెద్దవిగా కావడంతో వేయ లేదని సమాధానాలు చెబుతున్నారు. దీంతో పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలను నాటినప్పటికీ నిర్వహణలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోప ణలు ఉన్నాయి. అయితే నాటిన మొక్కలను ఎలాంటి కంచేలు ఏర్పాటు చేయక పోవడంతో పశువుల పాలయ్యాయి. కొన్ని చోట్ల మొక్కలు చని పోయాయి. వాటిని నిర్వహణ లేక అవి ఎదుగదల లేదని విమర్శలు ఉన్నాయి. ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కలు లేవని తనిఖీల్లో వెల్లడైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ తనిఖీ గ్రామ సభలో గ్రామస్థులు నిలదీస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు వృధా అవుతున్నాయి. సంబంధి త అధికారులు అశ్రద్ధ వహించి నాటిన మొక్కలకు కంచే ఏర్పాటు చేసి ప్రతి రోజు నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటే మొక్కలు ఏపుగా పెరిగి పచ్చధనం ఇచ్చి ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
లక్ష్యం మేరకు ప్రణాళికలు..
- దత్తారాం, డీఆర్‌డీవో
మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లాలో 335 పంచాయతీల్లో నర్సరీల్లో పనులు సా గుతున్నాయి. కవర్లలో మట్టి నింపుతున్నారు. నిర్దేశిం చిన లక్ష్యం చేరుకుంటాం. పనులు ముమ్మరంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. మొక్కల సంరక్ష ణలో ప్రజల భాగస్వా మ్యం అవసరం. ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటి ఆవరణలో, రోడ్లకు ఇరువైపు లా నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నాం.