Share News

kumaram bheem asifabad- గర్భిణులు ప్రతీ నెల పరీక్షలు చేయించుకోవాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:21 PM

గర్భిణులు ప్రతీ నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని రింగరీట్‌ గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సోమవారం డీఎంహెచ్‌వో సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు

kumaram bheem asifabad- గర్భిణులు ప్రతీ నెల పరీక్షలు చేయించుకోవాలి
అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో సీతారాం

వాంకిడి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు ప్రతీ నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని రింగరీట్‌ గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సోమవారం డీఎంహెచ్‌వో సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులకు మలేరియా జ్వరం రావడంతో గ్రామంలో మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 26 మందికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వినయ్‌, హెచ్‌ఈవో రవిదాస్‌, సిబ్బంది అశోక్‌, నితీష్‌, ఏఎన్‌ఎం పుష్ప, ఆశా వర్కర్‌ కమల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 10:21 PM