Share News

kumaram bheem asifabad- గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:18 PM

గర్భిణులు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి సీడీపీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని కర్జవెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ఇంటింటా పోషణ మాసోత్సవాలు- పోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.

kumaram bheem asifabad- గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి
చింతలమానేపల్లిలో మాట్లాడుతున్న సీడీపీవో విజయలక్ష్మి

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి సీడీపీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని కర్జవెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ఇంటింటా పోషణ మాసోత్సవాలు- పోషణ్‌ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి ఏసీడీపీవో హేమలత, సూపర్‌వైజర్‌ అరుణాదేవి, అలేఖ్య ప్రధానోపాధ్యాయుడు సంపత్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): పోషకాహరం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యకరంగా ఉండవచ్చ ని ఏసీడీపీవో రేణుక అన్నారు. రెబ్బెన మండలం కైరిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు ప్రతి రోజు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు. పిల్లలను ప్రతి రోజు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాల న్నారు. అనంతరం పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంధ్యారాణి, సూపర్‌వైజర్‌ తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు. కాగా జక్కులపల్లి అంగన్‌వాడీ కేంద్రంతో పాటు భగత్‌సింగ్‌ నగర్‌, ఎస్టీఆర్‌ నగర్‌ అంగన్‌వాడీ కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరైన పోషకామారం అందించాలని పాట్నాపూర్‌ సర్పంచ్‌ కందారె లక్ష్మి అన్నారు. మండలంలోని పాట్నాపూర్‌లో సీడీపీవో ఇందిర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ్‌ కార్యక్రమంలో సర్పంచ్‌ మాట్లాడారు. గర్భిణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ వైద్యులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో ఇందిర, సూపర్‌వైజర్‌ సంధ్యారాణి, అంగన్‌వాడీ టీచర్‌ విమల, వనిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధనోరాలో పోషణ పక్వాడ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో ఇందిర మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగించాలన్నారు. ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారం మొదలు పెట్టి, తల్లి పాలతో సహా పౌష్ఠికాహారం పెట్టాలని సూచించారు. దీన్ని రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలన్నారు. మూడేళ్లు నిండిన చిన్నారులను వెంటనే సమీప అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించాలని కోరారు.

Updated Date - Apr 18 , 2026 | 11:18 PM