kumaram bheem asifabad- గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:54 PM
గర్భిణులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ అన్నారు. మండలంలోని జైభీంనగర్, మన్నెగూడ, హీరాపూర్, సిర్పూర్-2, చీలపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.
సిర్పూర్(టి), ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): గర్భిణులు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ అన్నారు. మండలంలోని జైభీంనగర్, మన్నెగూడ, హీరాపూర్, సిర్పూర్-2, చీలపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవ ల్సిన పోషకాహార గురించి సూపర్‌వైజర్ పద్మ వివరించారు. ఈ నెల 9 నుంచి 23 వరకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్షం(పక్వాడ) కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలి పారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంగ, ఉప సర్పంచ్ మధులు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గర్భిణులు బాలింతలు, చిన్న పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): ఐసీడీఎస్ కేంద్రాల్లో కొనసాగుతున్న పోషణ పక్వాడ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆత్రం అయ్యుబాయి కోరారు. మండలంలోని గౌరి1 కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పోషణ,పక్వాడ కార్యక్రమంలో మాట్లాడారు. గర్భిణులు, బాలింతలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతు గర్భిణులు, బాలింతలు ఐరన్, ప్రోటీన్, కూరగాయలు పండ్లు వంటి ఆహరాన్ని తీసుకోవాలని సూచించారు. ఆదేవిధంగా చిన్నారుల ఎదుగుదలకు సమతుల్యమైన ఆహారం అవసరం అన్నారు. ముఖ్యంగా మహిళలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ లింగమ్మ, అంగన్‌వాడీ టీచర్ భుతాలె విమల బాయి, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట,(ఆంధ్రజ్యోతి): మండలంలోని చెడ్వాయి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జ్యోతి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నానాజీ, అంగన్‌వాడీ టీచర్ అబ్దుల్ ఉన్నీసా, ఏఎన్‌ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.