kumaram bheem asifabad- గర్భిణులకు పోషకాహారం అందజేయాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:48 PM
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల అంగన్ వాడీలకు సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మోబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జైనూర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావ్ అన్నారు. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల అంగన్ వాడీలకు సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మోబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన చిన్నారులకు తొలిముద్ద కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. పిల్లలతో పాటు గర్భిణులకు పోషకాలం అందించాల్సిన బాధ్యత ఐసీడీఎస్ సిబ్బందిపై ఉందన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు రోజు వాదీగా మోబైల్ ఫోన్లలో నమోదు చేయాలని సూచించారు. ఆనంతరం 140 మంది అంగన్ వాడీ టీచర్లుకు మోబైల్ ఫోన్లు అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణ పార దర్శకత కోసం ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లకు టీచర్లకు అందజేస్తున్న మోబైల్ ఫోన్లు సద్వినియోగం చేసి పకడ్బందీగా కేంద్రాల నిర్వాహణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో ఇందీరా, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, ఐసీడీఎస్ సూపరవ్ వైజర్లు సోంబాయి,లింగమ్మ, సృజన సిబ్బంది చందు, గోవింద్, సర్పంచులు జాలీంషా, నాయకులు మేస్రాం అంబాజీరావ్ తదితరులు పాల్గొన్నారు.