పక్కాగా...సాగు లెక్క
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:30 PM
పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శా ఖ అధికారులు డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టా రు. ఈ మేరకు జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున నియమించింది. సర్వే కోసం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం
ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియామకం
జిల్లాలో ఇప్పటివరకు 3.05 లక్షల ఎకరాల సాగు
భీమిని, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి) : పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శా ఖ అధికారులు డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టా రు. ఈ మేరకు జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున నియమించింది. సర్వే కోసం ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ మేరకు వలం టీర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని పంటల వివరాలను దానిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ ఈవోలతో సర్వే చేయించాలనే ప్రణాళికలు ఉన్నా వారు ఇతరత్రా పనులతో బిజీగా ఉండటంతో వలంటీర్ల ని యామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇ ప్పటికే ఎంపికైన వలంటీర్లు జిల్లాలో రెవెన్యూ గ్రామా ల్లో సర్వే పనులను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 3.05 లక్షల ఎకరా లు సాగులోనికి వచ్చాయి.
- ఇప్పటికే 335 మంది నియామకం...
జిల్లాలో ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 367 మంది వలంటీర్లను ఎంపిక చేయాల్సి ఉం ది. ఇప్పటికే 335 మంది వలంటీర్లను రిజిస్ర్టేషన్ చేశా రు. వారు తమకు కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో స ర్వే పనులను ప్రారంభించారు. వారు సర్వేలో తేలిన వి వరాలను ఆన్‌లైన్ నమోదు చేస్తున్నారు. మిగతా వా లంటీర్ల 32 మందిని త్వరలోనే నియామకం చేపట్టను న్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎంపిక చేసిన వ లంటీర్లు సదరు రెవెన్యూ గ్రామానికి చెందిన వారై ఉం డాలి. వారు ఆండ్రాయిడ్ 11 ఫోన్‌ను కలిగి ఉండి కనీ సం పదో తరగతి వరకు పాస్ అయి ఉండాలి.
- ఎంపికైన వలంటీర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ...
ఎంపికైన వలంటీర్లకు ఆయా రెవెన్యూ గ్రామాల్లో స ర్వే పనులను ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 45 రోజుల లోపు వీరు తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ఏరోజుకు ఆ రోజు యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్‌లోడ్ చేసిన ఒక్కోదానికి కేంద్రం ఏడు రూపాయలు చెల్లిస్తుం ది. ఆన్‌లైన్ విధానం ద్వారా వీరికి డబ్బులు చెల్లించ నున్నారు. ఎంపికైన వలంటీర్లకు ఇప్పటికే యాప్ విని యోగం, పంటల సాగు నమోదు విషయంలో ఆన్‌లైన్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
సర్వేతో లాభాలు...
రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో జిల్లాలో ఏ పంటలు ఎంత మేరకు సాగు అవుతుంది అనే విషయాలు ఖచ్చితమైన డేటా అందుబాటులోనికి వస్తుంది. దీని ఆధారంగానే రైతులకు ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలు, పంటల నష్ట పరిహారాలు వంటివి రైతులకు అందుతాయి. సన్న ధాన్యానికి రూ. 500 బో నస్, రైతుబంధు, ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సర్వేలో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంటల ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర అభించే అవకాశాలు ఉంటాయి.
నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేస్తాం...
సురేఖ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లాలోని రెవెన్యూ గ్రామాల్లో వాలంటీర్లను ఎంపిక చేసి నివేదికలను పింపిచాం. దీనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయిస్తాము. డిజిటల్ సర్వే ద్వారా ఆయా రెవె న్యూ గ్రామాల్లో ఏ రకమైన పంటలను సాగు చేస్తు న్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. పంటల అంచ నాల్లో ఖచ్చితత్వం పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళి కలను రూపొందించేందుకు ఇది దోహద పడుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులను కలుగకుండా ప్రక్రియను పూర్తి చేస్తాం.