వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:03 PM
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల డీఎంహెచ్‌వో నరేం దర్ రాథోడ్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని నాలుగో డివిజన్‌లో కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో పీఎంపీ, ఆర్‌ఎంపీ సంఘ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
శ్రీరాంపూర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల డీఎంహెచ్‌వో నరేం దర్ రాథోడ్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని నాలుగో డివిజన్‌లో కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో పీఎంపీ, ఆర్‌ఎంపీ సంఘ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ, థై రాయిడ్, తదితర రుగ్మతలకు, తెల్ల రక్తకణా లు తక్కువగా ఉన్న వారు అవసరమైన మం దులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉ న్నాయన్నారు. అవసరమున్నవారు మంచిర్యా ల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికానీ, నస్పూర్ ప్రా థమిక ఆరోగ్యకేంద్రంలోకానీ ఉచితంగా పొంద వచ్చని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంలో వ చ్చే మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బారిన ప డకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్పొ రేటర్ గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్నా రులకు వయస్సునుబట్టి అందించే టీకా లు సమయం ప్రకారం ఇప్పించాలన్నారు. ప్ర స్తుత వర్షాకాలంలో ఆశా కార్యకర్తలు అందుబా టులో ఉంటూ వివిధ వ్యాధులకు ఇంటింటా మందులు పంపిణీ చేయాలని కోరారు. అనం తరం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను కార్పొ రేటర్‌తో పాటు పీఎంపీ, ఆర్‌ఎంపీ డాక్టర్స్ అ సోసియేషన్ సభ్యులు, ఆశా కార్యకర్తలు ఘ నంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న స్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నక్క వెంక టేష్, వైద్యురాలు రూబియా, హెచ్‌ఈఓలు నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు త్రివే ణి, కవిత, స్వాతి, ఆశా కార్యకర్తలు స్వర్ణలత, లావణ్య, భాగ్యలక్ష్మి, శ్యామల, శ్రీదేవి పాల్గొన్నారు.