Share News

kumaram bheem asifabad- పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 10:23 PM

జిల్లాలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలు పని ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని ఎల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని కంచర్‌గూడ గ్రామంలో కొనసగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి బుధవారం కలెక్టర్‌ కె.హరిత సందర్శించారు.

kumaram bheem asifabad- పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలి
కూలీలకు అంబలి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలు పని ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని ఎల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని కంచర్‌గూడ గ్రామంలో కొనసగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి బుధవారం కలెక్టర్‌ కె.హరిత సందర్శించారు. ఉపాధి హామీ కూలీలకు అంబలి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలు ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తలకు తప్పని సరిగా వేడి గాలులు, చెవులలో రాకుండా రుమాలు చుట్టుకోవాలన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనిని త్వరగా పూర్తి చేసి ఇంటికి చేరుకోవాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయటకు వెళ్లకూడదని సూచించారు వేడి గాలుల పట్ల రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సెల్‌ టవర్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సెల్‌ టవర్ల నిర్మాణాలు వేగవంతం చేసి మారు మూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో, టిపైబర్‌ టవర్ల నిర్మాణాలు, స్థలాల ఎంపికపై సంబంధిత అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా అటవీ శాఖాధికారి నీజర్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్‌డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డి.జిటల్‌ భారత్‌ నిధి కింద బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో 24 టవరుర్ల మంజూరయ్యాయని అన్నారు. వీటికి వెంటనే స్థలాల ఎంపికను చేపట్టాలన్నారు. ఇప్పటికీ స్థలం ఎంపిక పూర్తయిన వాటికి టవర్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. . రెవెన్యూ, ఫారెస్ట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు, జాయింట్‌ సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. ఎయిర్‌టెల్‌, జియో సంస్థల టవర్ల నిర్మాణాలు పూర్తి చేసి మారు మూల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించాలన్నారు. టీ పైబర్‌ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించాని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, ఎస్‌ఈఎన్‌పీడీ, సీఎల్‌ జాడి ఉత్తం, ఈఈపీఆర్‌ ధర్మేందర్‌, ఈఈ మిషన్‌ భగీరథ సిద్ధికి, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో, టి పైబర్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 10:23 PM