kumaram bheem asifabad- పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:38 PM
పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీజీఈ జేఏసీ నాయకుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్డ్, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో టీజీఈ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కాగజ్‌నగర్ తహసీల్దార్ మధూకర్‌కు వినతి పత్రం అందజేశారు.
కాగజ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీజీఈ జేఏసీ నాయకుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్డ్, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో టీజీఈ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కాగజ్‌నగర్ తహసీల్దార్ మధూకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు ఏటుకూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జూన్ 2 వరకు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను రెండు దశల్లో చెల్లించాలని డిమాండ్ చేశారు. మే 1 నుంచి హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విఽధానాన్ని అమలు చేయాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు గిరిజన సంక్షేమ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేయాలని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగుల కరువు భత్యం డీఏ రూపంలో విడుదల చేయాలన్నారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న 64 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ సంఘం ప్రతినిధులు శాంతి కుమారి, అబ్రహం, జాడి దేవాజి, శ్రావణ్, శశికాంత్, రవి, పోలదాసరి రాంచెందర్, కొండయ్య, మహేష్, వనిత, రాజమణి, నాగరాణి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఈజేఏసీ నాయకులు మినహాజ్ అలీ, పునేష్, సంతోష్, శ్యాం, కవిత, జ్యోతి, రమేష్ బాబు, అనసూయ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలో టీజీఈజేసీ కమిటి పిలుపు మేరకు పీఆర్టీఈయూ టీఎస్ ఆధ్వర్యంలో బోజన సమయంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సూర్యప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఈజేఏసీ నాయకులు రాకేష్, రాజకమలాకర్‌రెడ్డి, గంగాభవానీ, వెంకటేష్, మల్లన్న, సుజాత, సంతోష్‌కుమార్, సంతోష్, సతీష్, అబ్దుల్ ముక్తదీర్, శేఖర్, మల్లేష్, సాదీయా, సాయిమాధురి తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ మండలంలోని ఉపాధ్యాయులు తహసీల్దార్ సంతోష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అఖిల్, శివప్రసాద్, భరత్, భాస్కర్, విద్యాసాగర్, నగేష్, యోగేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): పీఆర్సీని అమలు చేయాలని మండలంలోని ఉపాధ్యా యులు తహసీల్దార్ సంతోష్‌కు శుక్రవారం టీఎస్‌టీడబ్ల్యూటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రకాష్, జేఏసీ నాయకులు కృష్ణారావు, రవీందర్, గోపాల్, యశ్వంత్‌రావు, అనంత్, వెంకటేష్, గంగారాం, ప్రపుల్, లచ్చు, అవినాష్, శ్రీనివాస్, తార, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): పీఆర్సీని అమలు చేయాలని మండలంలోని ఉపాధ్యా యులు తహసీల్దార్ సంతోష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వినోద్, గుణాకర్, అశోక్, తిరుపతి, ఎం.తిరుపతి, చిలుకయ్య, సాయినాథ్, సునీల్‌రావు, భగవాన్, గణపతి, రాకేష్, తిరుపతి, రాములు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్డ్, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ ప్రహ్లాద్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.