kumaram bheem asifabad- పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 10:29 PM
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ వెంటనే ప్రకటించి అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి ఊశన్న తెలిపారు. పెంచికల్‌పేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు.
పెంచికల్‌పేట్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ వెంటనే ప్రకటించి అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి ఊశన్న తెలిపారు. పెంచికల్‌పేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఉపాధ్యాయలకు మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని కోరారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులను ఇవ్వాలన్నారు. గురుకులాల్లో పని చేసే ఉపాధ్యా యులు అడ్మిషన్లు చేయాలనే ఒత్తిడి తగ్గించాలని చెప్పారు. గురుకులాల్లో కేజీబీవీలు, మోడల్ స్కూల్‌లో కేర్ టేకర్లను నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం రాజ్‌కమలాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సాయికుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్‌కుమార్, నాయకులు సతీష్, రాజన్న, రామకాంత్, మల్లేష్, సాయికిరణ్, రామకృ ష్ణ, సమ్మయ్య, సమతకుమారి, సుమతి, మోహన కుమారి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.