నాడు భార్య.. నేడు భర్త
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:05 AM
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మునిసిపల్ చైర్మన్‌గా సాత ప్రవీణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
శంకర్‌పల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మునిసిపల్ చైర్మన్‌గా సాత ప్రవీణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 15వ వార్డు నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ప్రవీణ్ సతీమణి విజయలక్ష్మి గత ఎన్నికల్లో అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. శంకర్‌పల్లి మొట్టమొదటి చైర్‌పర్సన్‌గా 2020-2025 మధ్య విజయలక్ష్మి పనిచేశారు. శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ 2020 ఆగస్టులో మునిసిపాలిటీగా ఏర్పడింది. ప్రవీణ్ గతంలో శంకర్‌పల్లి ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ఆయన తండ్రి ఆత్మలింగం సర్పంచ్‌గా సేవలందించారు.